News June 14, 2024

ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువు పెంపు

image

ఆధార్‌ కార్డును ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. గతంలో నిర్ణయించిన గడువు నేటితో ముగియాల్సి ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అప్‌డేట్ చేసుకునేందుకు UIDAI <>వెబ్‌సైట్‌లో<<>> ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

Similar News

News October 11, 2025

అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం క్యాన్సర్ లక్షణాలు

image

*అతిగా బరువు తగ్గిపోవడం, జ్వరం, అలసట
*శరీర రంగు నల్లగా, చర్మం ఎర్రగా మారడం. దురద రావడం
*మూత్రానికి వెళ్లేటప్పుడు నొప్పి. మూత్రంలో రక్తం పడటం
*పుట్టుమచ్చలు పెరిగి వాటి నుంచి రక్తం కారడం. చిన్న గాయాలైనా ఎక్కువ కాలం మానకపోవడం
*రొమ్ములు, వృషణాలు, గ్రంథులు, కణజాలాలు గట్టిగా మారడం
> లుకేమియా, స్కిన్, బ్రెస్ట్, పెద్దపేగు, నోటి లాంటి క్యాన్సర్ రకాలను బట్టి ఈ లక్షణాలు కనిపిస్తాయి. డాక్టర్లను సంప్రదించాలి.

News October 11, 2025

విషపూరిత దగ్గు మందు.. తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే: CDSCO

image

మధ్యప్రదేశ్‌లో 23 మంది పిల్లల మరణాలకు తమిళనాడు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) పేర్కొన్నట్లు NDTV తెలిపింది. కోల్డ్రిఫ్ సిరప్ తయారు చేసే ‘Sresan’ కంపెనీలో తనిఖీలు చేయలేదని, దీనివల్ల ఆ విషపూరితమైన సిరప్ మార్కెట్లోకి వచ్చిందని చెప్పింది. ఆ సంస్థలో అసలు ఆడిట్ జరగలేదని, సెంట్రల్ పోర్టల్‌లోనూ రిజిస్టర్ కాలేదని వెల్లడించింది.

News October 11, 2025

పర్యాటకంలో గోవా, సిమ్లాలను దాటిన కాశీ

image

ఈశ్వరుడు కొలువైన పురాతన కాశీ నగరం నేడు సంప్రదాయ పర్యాటక కేంద్రాలైన గోవా, సిమ్లాలను అధిగమించింది. కేవలం ఆధ్యాత్మిక రాజధానిగా మాత్రమే పరిగణించే వారణాసి, ఇప్పుడు భారత పర్యాటక రంగానికే పునర్నిర్వచనం ఇస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2024లో 11 కోట్లకు పైగా పర్యాటకులు వారణాసిని సందర్శించారు. 2025లో తొలి 6 నెలల్లోనే ఈ సంఖ్య 13 కోట్లకు చేరింది. 2021లో కేవలం కాశీ పర్యాటకుల సంఖ్య 30.7 లక్షలుగా ఉంది.