News April 15, 2025
కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలకు ఆది శ్రీనివాస్ కౌంటర్

TG: కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిన బిల్డర్లు, వ్యాపారవేత్తలు ప్రభుత్వాన్ని కూలగొట్టాలని తమకు చెబుతున్నారంటూ BRS MLA ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై విప్ ఆది శ్రీనివాస్ స్పందించారు. ‘ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్రతోనే ప్రభాకర్ వ్యాఖ్యలు చేశారు. వాటిపై విచారణ జరిపించాలని CMను కోరతా. కుట్రకోణం ఉంటే ఆయనపై చర్యలు తప్పవు. ఈ ఐదేళ్లు కాదు.. మరో ఐదేళ్లూ మా ప్రభుత్వమే ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News April 17, 2025
ఎంగేజ్మెంట్ చేసుకున్న హీరోయిన్

హీరోయిన్ జనని నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. పైలట్ సాయి రోషన్ శ్యామ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందని పేర్కొన్నారు. సంబంధిత ఫొటోలను షేర్ చేశారు. ఈ బ్యూటీ బాలా తెరకెక్కించిన ‘వాడు-వీడు’ మూవీతో తెరంగేట్రం చేశారు. తెగిడి, హాట్ స్పాట్, భగీర, బెలూన్, కాజల్ కార్తీక వంటి చిత్రాల్లో నటించారు. జననికి పలువురు సినీ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు.
News April 17, 2025
IPL: రాజస్థాన్ కెప్టెన్ రిటైర్డ్ హర్ట్

ఢిల్లీతో మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. అతడు 19 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 31 రన్స్ చేసి మంచి ఊపు మీద కనిపించారు. అంతలోనే పక్కటెముల గాయం వేధించడంతో మైదానాన్ని వీడారు. తర్వాతి మ్యాచుకు సంజూ అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. సంజూ దూరమైతే మాత్రం రాజస్థాన్‌కు పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు.
News April 16, 2025
రేపు సిట్ విచారణకు విజయసాయిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో రేపు సిట్ విచారణకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరు కానున్నారు. ఉదయం 10 గంటలకు వస్తానని అధికారులకు ఆయన సమాచారం ఇచ్చారు. కాగా ఈనెల 18న విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపింది. ఒకరోజు ముందే హాజరవుతానని ఆయన కోరగా అధికారులు సమ్మతించారు. మరోవైపు ఇదే కేసులో ఈనెల 19న విచారణకు హాజరు కావాలని రాజ్ కసిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది.