News August 10, 2025
ముగిసిన ‘ఆడుదాం ఆంధ్ర’ స్కామ్ విచారణ

AP: గత ప్రభుత్వ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో జరిగిన స్కామ్‌పై విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును త్వరలో విజిలెన్స్ అధికారులు డీజీపీకి సమర్పించనున్నారు. కాగా ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో స్పోర్ట్స్ కిట్స్, ఈవెంట్స్ పేరిట అవినీతి జరిగిందనే ఆరోపణలతో ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
Similar News
News August 10, 2025
చికెన్ ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా?

చికెన్‌ను పవర్ హౌస్ అని అంటారు. దీనిని తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ‘చికెన్ తింటే ఎముకలు, కండరాల దృఢత్వంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక స్థితిని సమతుల్యంగా ఉంచుతుంది. దీనిని అతిగా తింటే కొలెస్ట్రాల్ స్థాయులు, బరువు పెరుగుతారు. అలర్జీ, ఇన్ఫెక్షన్, హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది’ అని హెచ్చరిస్తున్నారు.
News August 10, 2025
‘మాస్ జాతర’ నుంచి మాస్ పోస్టర్

మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘మాస్ జాతర’ సినిమా నుంచి చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో మంటల్లో రవితేజ ఫైట్ చేస్తూ ఊర మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. భాను భోగవరపు తెరకెక్కించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ నెల 27న రిలీజ్ కానుంది. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ రేపు ఉదయం 11.08 గంటలకు రిలీజ్ కానుంది.
News August 10, 2025
భారత్‌తో ఘర్షణ.. పాకిస్థాన్‌కు భారీ నష్టం

భారత్‌తో తీవ్ర ఘర్షణ వల్ల పాకిస్థాన్‌కు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. 2 నెలలపాటు ఎయిర్‌స్పేస్ మూసివేయడంతో పాక్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ రూ.1,240 కోట్ల ఆదాయం కోల్పోయింది. పాక్‌కు భారత్ సింధూ జలాలను నిలిపివేయడంతో ప్రతీకారంగా ఆ దేశం ఎయిర్‌స్పేస్‌ను మూసివేసి మన ఫ్లైట్లను వెళ్లనివ్వడంలేదు. కానీ ఆ నిర్ణయం బెడిసికొట్టింది. అయినా బుద్ధి మార్చుకోని పాక్.. ఎయిర్‌స్పేస్ మూసివేతను AUG 24 వరకు పొడిగించింది.