News March 31, 2025
సామ్ కరన్‌పై ఆకాశ్ చోప్రా విమర్శలు

CSK సామ్ కరన్‌ను ఆడించడంపై ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. ‘CSK జట్టును సరిగ్గా ఎంపిక చేసుకోవాలి. నిజం చెప్పాలంటే అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండింటిలోనూ కరన్ విఫలమవుతున్నాడు. కాన్వే, రచిన్, గైక్వాడ్ తొలి 3స్థానాల్లో ఆడాలి. హుడా, త్రిపాఠీలో ఒకరినే ఆడించాలి. తర్వాత దూబే, విజయ్ శంకర్, జడ్డూ, ధోనీ ఉండాలి. ఆ లైనప్ కరన్ వల్ల బలహీనపడుతోంది’ అని తెలిపారు. కాగా ఇవాళ కరన్‌ను దూరంగా ఉంచారు.
Similar News
News November 13, 2025
రూ.12,000 కోట్ల కుంభకోణం.. JIL MD అరెస్ట్

రూ.12,000 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్ (JIL) ఎండీ మనోజ్ గౌర్‌ను అరెస్టు చేసినట్లు ED అధికారులు తెలిపారు. గృహ కొనుగోలుదారుల నుంచి సేకరించిన నిధుల మళ్లింపు, దుర్వినియోగంలో గౌర్ ప్రమేయం ఉందని గుర్తించారు. ఈ కేసులో జేపీ గ్రూప్ అనుబంధ సంస్థలైన జేపీ ఇన్‌ఫ్రాటెక్ లిమిటెడ్, జైప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగినట్లు భావిస్తున్నారు.
News November 13, 2025
32 కార్లతో సీరియల్ అటాక్స్‌కు కుట్ర?

ఢిల్లీ బ్లాస్ట్ దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. పేలుడు పదార్థాల తరలింపునకు, బాంబుల డెలివరీకి 32 కార్లను టెర్రరిస్టులు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. బాబ్రీ మసీదును కూల్చిన రోజు(DEC 6) సీరియల్ అటాక్స్‌కు కుట్ర చేసినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని 6 లొకేషన్లు సహా దేశంలోని పలు ప్రాంతాలను టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 4 కార్లను అధికారులు గుర్తించారని సమాచారం.
News November 13, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 3

13. భూమి కంటె భారమైనది? (జ.జనని)
14. ఆకాశం కంటె పొడవైనది? (జ.తండ్రి)
15. గాలి కంటె వేగమైనది? (జ.మనస్సు)
16. మానవునికి సజ్జనత్వం ఎలా వస్తుంది? (జ.ఇతరులు తనపట్ల ఏ పని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో.. తాను ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండనివారికి సజ్జనత్వం వస్తుంది.)
17. తృణం కంటె దట్టమైనది ఏది? (జ.చింత)
<<-se>>#YakshaPrashnalu<<>>


