News December 10, 2024
జైపూర్ షెడ్యూల్లో రజినీతో ఆమిర్ ఖాన్ షూట్!

సూపర్ స్టార్ రజినీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కూలీ’ సినిమాలో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జైపూర్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగా ఈ షెడ్యూల్లో రజినీకాంత్తో పాటు ఆమిర్ ఖాన్ పాల్గొన్నట్లు సమాచారం. పదిరోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Similar News
News December 20, 2025
రేపు తెలంగాణ భవన్కు కేసీఆర్

TG: చాలారోజుల తర్వాత గులాబీ బాస్ KCR పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్కు వెళ్లనున్నారు. రేపు మ.2 గంటలకు ఆయన ఆధ్వర్యంలో BRS LP, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త భేటీ జరగనుంది. ‘ఏపీ జల దోపిడీ-కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం’ అనే అంశంపై మాట్లాడనున్నారు. సాగునీటి హక్కుల రక్షణ కోసం ‘మరో ప్రజా ఉద్యమం’పై KCR దిశానిర్దేశం చేస్తారని BRS వర్గాలు తెలిపాయి. పార్టీ సంస్థాగత నిర్మాణంపైనా ఆయన సూచనలు చేస్తారని చెప్పాయి.
News December 20, 2025
క్లీనింగ్ టిప్స్

* నిమ్మకాయను మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని దానిలో కాస్త వంట సోడాను కలిపి సింక్ కొళాయిలకు రాసి అరగంట తరువాత కడిగితే మురికి వదిలిపోతుంది.
* కప్పుల్లో కాఫీ, టీ మరకలు వదలకపోతే వెనిగర్ లో ఉప్పు కలిపి రుద్దితే త్వరగా వదిలిపోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీల్ సింక్ మీద నీళ్ళ మరకలు పోవాలంటే వంటసోడాలో వెనిగర్ కలిపి రుద్దాలి. గంట తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే కొత్తదానిలా మెరిసిపోతుంది.
News December 20, 2025
భారీగా పెరిగిన వెండి ధర!

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి ధరలు భారీగా పెరగ్గా గోల్డ్ రేట్స్ తటస్థంగా ఉన్నాయి. కేజీ సిల్వర్పై ఏకంగా రూ.5,000 పెరిగి జీవితకాల గరిష్ఠానికి చేరింది. ప్రస్తుతం KG వెండి రేటు రూ.2,26,000గా ఉంది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,34,180, 22క్యారెట్ల 10gmల గోల్డ్ రేటు రూ.1,23,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.


