News October 8, 2024

రెండు రాష్ట్రాల్లో ఆప్ డకౌట్

image

జమ్మూకశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ డకౌట్ అయ్యింది. ఆ పార్టీ అభ్యర్థులు కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. దీంతో హరియాణాలో కాంగ్రెస్‌తో చేతులు కలపకపోవడమే పెద్ద తప్పిదమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పొత్తు పెట్టుకొని ఉంటే అధికార బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకుండా ఉండేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Similar News

News September 19, 2025

పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

image

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442, ఏఆర్ కానిస్టేబుల్ 3,271, SI సివిల్ కేటగిరీలో 677, ఏఆర్‌లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది. వీటిని జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

News September 19, 2025

‘చలో మెడికల్ కాలేజీ’.. వైసీపీ ఆందోళనలు

image

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు #SaveMedicalCollegesInAP అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది.

News September 19, 2025

పొంగులేటి బయోపిక్.. హీరోగా సుమన్

image

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ‘శ్రీనన్న అందరివాడు’ అనే టైటిల్‌తో రూపుదిద్దుకునే ఈ మూవీలో పొంగులేటి వ్యక్తిగత, రాజకీయ జీవితాన్ని చూపించనున్నారు. సీనియర్ నటుడు సుమన్.. పొంగులేటి పాత్రను పోషిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. బయ్యా వెంకట నర్సింహ రాజ్ దీనికి డైరెక్టర్, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాసర్ల శ్యాం పాటలు రాస్తున్నారు.