News January 22, 2025

ఆయుష్మాన్ భారత్‌కు ‘ఆప్‌’ద అడ్డంకులు: మోదీ

image

ఆమ్‌ఆద్మీ వంచన, అబద్ధాలకు శీశ్‌మహలే పెద్ద ఉదాహరణ అని PM మోదీ అన్నారు. ఢిల్లీ BJP కార్యకర్తలతో మాట్లాడారు. ‘ఉచిత వైద్యం అందించే ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని ‘ఆప్‌’ద మనుషుల్ని కోరాం. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఎన్నో ప్రయోజనాలున్న ఈ స్కీమ్ అమలుకు ఆప్‌ద అడ్డంకులు సృష్టించింది. భారత ఎకానమీకి మిడిల్‌క్లాసే వెన్నెముకని బీజేపీ భావిస్తుంది. వారి ఆశలు, ఆశయాలను మనం అర్థం చేసుకున్నాం’ అని అన్నారు.

Similar News

News November 25, 2025

భారీగా పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,910 పెరిగి రూ.1,27,040కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,750 ఎగబాకి రూ.1,16,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ. 1,74,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News November 25, 2025

గ్యాస్ లీకైనపుడు ఏం చేయాలంటే?

image

ఇంట్లో గ్యాస్‌ సిలిండర్, స్టవ్‌ లీకేజీ, నిర్వహణ లోపాలతో ప్రమాదాలు జరిగి తీవ్ర విషాదాలను మిగులుస్తున్నాయి. ఇలా కాకుండా ఉండాలంటే.. గ్యాస్‌ లీకై దాన్ని అదుపు చేయలేకపోతే కిటికీలు, తలుపులు తెరవాలి. మంటలు చెలరేగితే మందపాటి దుప్పటి కప్పి ఆర్పేయాలి. రెగ్యులేటర్‌ను ఆపేయాలి. సిలిండర్‌ దగ్గర మంటలు చెలరేగితే తడిగా ఉండే గోనెసంచి/ వస్త్రాన్ని వేయాలి. అగ్నిమాపక శాఖ టోల్‌ఫ్రీ నంబరు 101కు సమాచారం ఇవ్వాలి.

News November 25, 2025

అంత్యక్రియల తర్వాత స్నానం ఎందుకు చేస్తారు?

image

అంత్యక్రియలు పూర్తయ్యాక అక్కడికి వెళ్లిన వాళ్లందరూ స్నానం చేస్తారు. లేకపోతే ఆత్మలు దేహంలోకి ప్రవేశిస్తాయని నమ్ముతుంటారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. దహన సంస్కారాల సమయంలో ఆ దేహం నుంచి వచ్చే బ్యాక్టీరియా, అంటువ్యాధులు మనక్కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ అంటురోగాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, కచ్చితంగా స్నానం చేయాలి. అప్పట్లో నదులే స్నానానికి ప్రధాన వనరులు కాబట్టి అక్కడే స్నానమాచరించేవారు.