News February 22, 2025
ఆప్ వింత.. లేని శాఖకు 20 నెలలుగా మినిస్టర్

పంజాబ్లోని ఆప్ ప్రభుత్వంలో వింత ఘటన జరిగింది. లేని శాఖకు కుల్దీప్ సింగ్ 20 నెలలుగా మంత్రిగా ఉన్నారు. తాజాగా అసలు ఆ శాఖ మనుగడలో లేదని అక్కడి ప్రభుత్వం గుర్తించింది. తప్పు తెలుసుకొని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా, కుల్దీప్సింగ్ 20 నెలలుగా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్(ఉనికిలో లేనిది), NRI అఫైర్స్ శాఖలకు మంత్రిగా ఉండటం విశేషం. ఆప్ ప్రభుత్వం పాలనను జోక్లా మార్చిందని BJP మండిపడింది.
Similar News
News December 8, 2025
‘నీ భార్యను ఇండియాకు పంపేయ్’.. JD వాన్స్పై నెటిజన్ల ఫైర్

వలసలపై US ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సామూహిక వలసలు అమెరికా కలను దొంగతనం చేయడమేనని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఇది విదేశీయులపై ద్వేషమేనని నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘మీ భార్య ఉష, ఆమె ఫ్యామిలీ, మీ పిల్లలను ఇండియాకు పంపేయండి’ అని మండిపడుతున్నారు. హిందువైన తన భార్య <<18155411>>క్రైస్తవం<<>>లోకి మారే ఛాన్స్ ఉందని ఇటీవల వాన్స్ చేసిన కామెంట్లు దుమారం రేపాయి.
News December 8, 2025
NCDCలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(<
News December 8, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.270 పెరిగి రూ.1,30,420కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.250 ఎగబాకి రూ.1,19,550 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.2,100 పెరిగి రూ.1,98,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి


