News March 21, 2024
సుప్రీంకోర్టుకు ఆప్ నేతలు?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారంతో ఆప్ నేతలు అలర్ట్ అయ్యారు. అత్యవసరంగా సమావేశమై తాజా పరిణామాలపై చర్చిస్తున్నారు. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సీఎంను ప్రశ్నించేందుకు 12 మంది ఈడీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
Similar News
News November 25, 2024
ఆకాశ్‌దీప్‌ను దక్కించుకున్న LSG
భారత బౌలర్ ఆకాశ్‌దీప్‌ను లక్నో చేజిక్కించుకుంది. అతడిని వేలంలో రూ.8 కోట్లకు కొనుగోలు చేసింది. ఫెర్గుసన్‌ను పంజాబ్ రూ.2 కోట్లకు దక్కించుకుంది. అఫ్గాన్ ప్లేయర్ ముజీబుర్ రెహ్మాన్ అన్‌సోల్డ్‌గా మిగిలారు.
News November 25, 2024
ఢిల్లీకి ఎందుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు: కేటీఆర్
TG: నిధుల కోసమే ఢిల్లీకి వెళ్తున్నానన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ‘పెళ్లికి పోతున్నవో, సావుకు పోతున్నవో.. ఎవరికి తెలుసు. 28 సార్లు ఢిల్లీ వెళ్లి రూ.28 కూడా తీసుకురాలేదు. బడే బాయ్, చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు?. మేం నీలాగా ఢిల్లీ గులాములం కాదు. పోరాటం మా రక్తంలోనే ఉంది. మా జెండా, ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే’ అని ఆయన ట్వీట్ చేశారు.
News November 25, 2024
అధికారులను ప్రశ్నించిన జస్టిస్ పీసీఘోష్ కమిషన్
TG: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో భాగంగా జస్టిస్ పీసీఘోష్ కమిషన్ మేడిగడ్డ ఏఈఈ, డీఈలను విచారించింది. నిర్మాణం, పనుల వివరాలపై ఆరా తీసింది. క్షేత్రస్థాయి పనుల రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్న కమిషన్, పనులపై ప్లేస్‌మెంట్ రికార్డులను అడిగి తెలుసుకుంది. ప్రాజెక్టు DPR, అనుమతులు సహా పలు అంశాలపై ప్రశ్నించినట్లు సమాచారం.