News January 27, 2025
15 గ్యారంటీలతో AAP మ్యానిఫెస్టో

AAP 15 గ్యారంటీలతో మ్యానిఫెస్టో ప్రకటించింది. తాము దీన్ని మ్యానిఫెస్టోగా కాదని ‘కేజ్రీవాల్ గ్యారంటీ’గా అభివర్ణిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతినెలా మహిళలకు రూ.2,100, వృద్ధులకు ఉచిత వైద్యం, 24గంటల తాగునీరు, యమునా నది శుద్ధీకరణ, విద్యార్థులకు ఉచిత రవాణా(మెట్రోలో 50% డిస్కౌంట్) తదితరాలు మ్యానిఫెస్టోలో చేర్చారు. ఢిల్లీ ఎన్నికలు వచ్చే నెల 5న జరగనుండగా, 8న ఫలితాలు వెలువడనున్నాయి.
Similar News
News January 18, 2026
టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను జనం తిప్పికొడతారు: కేటీఆర్

TG: బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై KTR ఫైరయ్యారు. ‘సీఎంగానే కాదు హోంమంత్రిగా ఉన్నావన్న సోయి లేకుండా BRS జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతల్లో పదేళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన TGలో ఇప్పుడు అరాచకాలు చేసేవారు రాజ్యమేలడం ఓ దరిద్రం. బీఆర్ఎస్ను ఎదుర్కోలేక BJPతో చీకటి ఒప్పందాలు, టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను ప్రజలు తిప్పికొడుతారు’ అని మండిపడ్డారు.
News January 18, 2026
హీరో ధనుష్తో పెళ్లి.. మృణాల్ టీమ్ రియాక్షన్ ఇదే

వచ్చే నెల 14న తమిళ హీరో ధనుష్తో <<18863331>>పెళ్లి<<>> అంటూ జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టీమ్ తెరదించింది. ‘మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవట్లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొంది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దని సూచించింది. కాగా ఇప్పటివరకు మృణాల్ గానీ ధనుష్ గానీ ఈ ప్రచారంపై స్పందించకపోవడం గమనార్హం.
News January 18, 2026
రాష్ట్ర పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలి: బొత్స

AP: రాష్ట్రంలో నెలకొంటున్న పరిణామాలపై ప్రధాని జోక్యం చేసుకోవాలని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ ఏడాది ఏ వర్గానికీ సంక్రాంతి సంతోషం లేదన్నారు. పండగ ముందే మద్యం ధరలు, భూముల విలువలు పెరిగాయని విమర్శించారు. ‘పంటలకు గిట్టుబాటు ధర లేదు. యూరియా ఇప్పటికీ అధిక ధరకే అమ్ముతున్నారు. ఆరోగ్యశ్రీ పూర్తిగా అటకెక్కింది. గ్రామ బహిష్కరణలు, శాంతిభద్రతల లోపాలపై ప్రధాని మోదీ స్పందించాలి’ అని కోరారు.


