News February 8, 2025
కవిత వల్లే ఢిల్లీలో ఆప్ ఓటమి: కొండా సురేఖ
TG: BRS MLC కల్వకుంట్ల కవితతో కలిసి కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ చేయడం వల్లే ఆప్ ఎన్నికల్లో ఓడిపోయిందని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. BRS పార్టీ ఎక్కడికెళ్లినా భస్మాసుర హస్తమేనని ఢిల్లీ ఎన్నికలతో తేలిపోయిందని ఎద్దేవా చేశారు. ‘ఢిల్లీ ఫలితాలనుద్దేశించి రాహుల్ గాంధీపై KTR వ్యాఖ్యలు అహంపూరితం. ఈ అహంకారాన్నిఅణచివేసేందుకే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
Similar News
News February 8, 2025
ఢిల్లీ ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పును అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీవాసుల హక్కులను రక్షించేందుకు, ఢిల్లీ అభివృద్ధి కోసం, కాలుష్యం, అవినీతి, ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగిస్తామని Xలో రాసుకొచ్చారు. ఈ ఎన్నికల్లోనూ ఢిల్లీలో కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.
News February 8, 2025
ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి: మోదీ
ఢిల్లీ ప్రజలకు ఆప్ నుంచి విముక్తి లభించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలకు ఈ రోజు పండుగలాంటిదని విజయోత్సవ సభలో చెప్పారు. ‘ఢిల్లీని వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చారు. ఢిల్లీ ప్రజల్లో కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇక్కడి ప్రజలు మోదీ గ్యారంటీని విశ్వసించి డబుల్ ఇంజిన్ సర్కార్ తెచ్చుకున్నారు. BJPని మనసారా ఆశీర్వదించారు. మీ ప్రేమకు అనేక రెట్లు తిరిగి ఇస్తాం’ అని పీఎం ప్రసంగించారు.
News February 8, 2025
ఆటగాళ్ల ప్రాక్టీస్.. స్టేడియం ఫుల్..!
ఇంగ్లండ్తో రేపు జరిగే రెండో వన్డే కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. భారత ఆటగాళ్లు నెట్ సెషన్లో బిజీ బిజీగా గడిపారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీగా ఒడిశా కటక్లోని బారాబతి స్టేడియానికి తరలివచ్చారు. దీంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వారు బిగ్గరగా అరుస్తూ మద్దతిచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో SMలో వైరల్గా మారింది.