News June 1, 2024

AARA SURVEY: ఆదిలాబాద్ బీజేపీ, పెద్దపల్లి కాంగ్రెస్!

image

ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీదేనని ఆరామస్తాన్ సర్వే తెలిపింది. బీజేపీ నుంచి గొడం నగేశ్, కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు పోటీలో ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవనుందని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ బరిలో ఉన్నారు.

Similar News

News September 15, 2024

‘NCC శిక్షణను కెడెట్లు సద్వినియోగం చేసుకోవాలి’

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో NCC సీఏటీసీ-7 శిక్షణ శిబిరం ఆదివారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాకు చెందిన 600 మంది కెడెట్లు ఈ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు. జిల్లా NCC కమాండింగ్ అధికారి కల్నల్ వికాస్ శర్మ మాట్లాడుతూ.. ఈనెల 23వ తేదీ వరకు ఈ శిబిరం కొనసాగుతుందని తెలిపారు. క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సైనికులకు ఇచ్చే తరహాలో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

News September 15, 2024

ADB: రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో మెరిసిన ఉమ్మడి జిల్లా జట్టు

image

హనుమకొండ పట్టణంలోని JNSస్టేడియంలో 2రోజులుగా జరిగిన రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలుర హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు గోల్డ్ మెడల్ సాదించినట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు, కనపర్తి రమేశ్ తెలిపారు. ఆదివారం ఫైనల్స్‌లో మహబూబ్ నగర్ జట్టుతో తలపడి గెలుపొందినట్లు తెలిపారు. క్రీడాకారులు, కోచ్ సునార్కర్ అరవింద్‌ను పలువురు అభినందించారు.

News September 15, 2024

ఆదిలాబాద్: పట్టుదలతో మూడు ప్రభుత్వ కొలువులు

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన పొచ్చన-రూప దంపతుల కుమారుడు సాయికృష్ణ పట్టుదలతో చదివి మూడు ప్రభుత్వ కొలువులు సాధించాడు. 2018లో గ్రూప్-4 పరీక్షలో సత్తాచాటి, ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. 2022లో మళ్లీ గ్రూప్-4 పరీక్ష రాసి ర్యాంకు సాధించాడు. తాజాగా విడుదలైన ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం నిర్వహించిన పరీక్ష ఫలితాలలో అసిస్టెంట్ ఎనలైటిక్ ఆఫీసర్‌గా ఎంపిక అయ్యాడు.