News September 20, 2025

రాష్ట్రంలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు

image

TG: రాష్ట్ర ప్రభుత్వంతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇవ్వడంతో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు సమ్మె విరమించాయి. ఆస్పత్రులు కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని మంత్రి రాజనర్సింహ తెలిపారు.

Similar News

News September 20, 2025

ఒమన్‌ అద్భుత ప్రదర్శన.. పాక్‌కు చురకలు!

image

ఆసియా కప్: టీమ్ ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పసికూన ఒమన్ జట్టు అద్భుత ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని మెప్పించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో శభాష్ అనిపించుకుంది. చివరి వరకు పోరాడి 21 రన్స్ తేడాతో <<17767421>>ఓడిపోయింది<<>>. ఈ నేపథ్యంలో ఒమన్ జట్టును చూసి పాక్ చాలా నేర్చుకోవాలని నెటిజన్స్ చురకలు అంటిస్తున్నారు. చిన్న జట్టు అయినా తమ పోరాటంతో హృదయాలు గెలిచిందని కామెంట్స్ చేస్తున్నారు.

News September 20, 2025

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: TTD

image

AP: 2025 సాలకట్ల బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు TTD EO అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చినా ఇబ్బందిలేకుండా సూక్ష్మ-క్షేత్రస్థాయి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఉ.8-10 గం. వరకు, రా.7-రా.9 గం. వరకు వాహన సేవలు. సా.6.30- రాత్రి 12 గంటల వరకు గరుడసేవ ఉంటుందన్నారు. ధ్వజారోహణం(SEP 24) రోజు CM చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

News September 20, 2025

AP మీదుగా మరో అమృత్ భారత్ రైలు

image

ఇండియన్ రైల్వేస్ మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనుంది. ఇది ఒడిశాలోని బ్రహ్మపుర్ నుంచి APలోని పలాస, విజయనగరం స్టేషన్ల మీదుగా గుజరాత్‌లోని సూరత్ సమీపంలోని ఉద్నా స్టేషన్‌కు చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులో ఉన్న 11 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లలో కొన్ని రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తున్నాయి. తాజాగా మరో సర్వీస్ ఏపీ స్టేషన్లను కలుపుతూ అందుబాటులోకి రానుంది.