News January 11, 2025
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్

TGలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. పెండింగ్ నిధులు పూర్తిస్థాయిలో చెల్లించేవరకు సేవలు అందించబోమని ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చిచెప్పాయి. ఈ నిలిపివేత తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశాయి. 2 రోజుల క్రితం ప్రభుత్వం రూ.120 కోట్ల బకాయిలు రిలీజ్ చేసింది. దీంతో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతాయని అంతా భావించారు. కానీ అన్ని బిల్లులను క్లియర్ చేయాలని నెట్వర్క్ ఆసుపత్రులు డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News December 16, 2025
లిస్టులోకి మరో 19మంది ప్లేయర్లు.. నేడే మినీ వేలం

IPL మినీ వేలం లిస్టులో అభిమన్యు ఈశ్వరన్తో సహా 19 మంది ప్లేయర్లు చేరారు. దీంతో ఆక్షన్లో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 369కి చేరింది. వేలానికి ముందు కొత్త ప్లేయర్లను చేర్చడం కొత్త విషయం కాకపోయినా ఇంతమంది యాడ్ కావడం ఇదే తొలిసారి అని BCCI తెలిపింది. నేడు గరిష్ఠంగా 77 మందిని కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఇవాళ 2.30PM నుంచి అబుదాబిలో ఆక్షన్ ప్రారంభం కానుంది. KKR పర్సులో అత్యధికంగా రూ.64.30CR ఉన్నాయి.
News December 16, 2025
నేడే ‘విజయ్ దివస్’.. ఎందుకు జరుపుకుంటారు?

DEC 16, 1971. ఇది పాకిస్థాన్పై యుద్ధంలో భారత్ సాధించిన విజయాన్ని గుర్తు చేస్తుంది. PAK సైన్యాధిపతి AAK నియాజీ 93వేల మంది సైనికులతో ఢాకాలో భారత్కు లొంగిపోతారు. పాక్ ఓడిపోయి తూర్పు పాకిస్థాన్ స్వతంత్ర ‘బంగ్లాదేశ్’గా ఏర్పడింది. ఈ విజయానికి గుర్తుగా ‘విజయ్ దివస్’ జరుపుకుంటున్నాం. 1971లో తూర్పు పాకిస్తాన్లో పాక్ ఆధిపత్యం, ఆంక్షలతో మొదలైన స్వతంత్ర పోరు క్రమంగా భారత్-పాక్ యుద్ధానికి దారితీసింది.
News December 16, 2025
గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరం: శశిథరూర్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది. దీన్ని ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవక మిషన్ (గ్రామీణ్)’ (VBGRAMG) అని పేర్కొంది. అయితే దీనిపై కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాంధీజీ పేరును తొలగించడం దురదృష్టకరమని, మహాత్ముడిని అగౌరవపరచొద్దని కాంగ్రెస్ MP శశి థరూర్ కోరారు.


