News September 26, 2024
జయం రవిని ఆర్తి వేధించింది: గాయని కెనీషా

తమిళ హీరో జయం రవి మాజీ భార్య ఆర్తిపై గాయని, మానసిక నిపుణురాలు కెనీషా సంచలన ఆరోపణలు చేశారు. కుటుంబీకులతో కలిసి రవిని ఆర్తి వేధించారని పేర్కొన్నారు. ‘రవిని ఆర్తి అండ్ కో ఎంత వేధించారో అతడి థెరపిస్టునైన నాకు తెలుసు. ఆయన పరువును తీసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లోని డబ్బును కూడా వాడేస్తున్నారు. నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. రవి పడిన వేదన ఎవరికీ రాకూడదు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News November 25, 2025
రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీల విజేత తూ.గో జిల్లా

రాష్ట్రస్థాయి అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాలికల హాకీ పోటీల్లో తూ.గో జిల్లా జట్టు విజయదుందుభి మోగించింది. సోమవారం జరిగిన ఫైనల్ పోటీల్లో ఈస్ట్ గోదావరి జట్టు క్రీడాకారిణులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి విజేతగా నిలిచారు. నక్కపల్లి హాకీ గ్రౌండ్లో జరిగిన బాలికల హాకీ ఫైనల్ పోటీలలో తొలి రోజు నుంచి ఆ జట్టు తిరుగులేని ఆదిత్యతను కనబరుస్తూ కప్పు చేజిక్కించుకుంది. ఆ జట్టుకు షీల్డ్ అందజేశారు.
News November 25, 2025
15 సంవత్సరాలు జరగని అభివృద్ధి నేను చేశాను: మంత్రి మండిపల్లి

మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి 15 సంవత్సరాలు చేయని అభివృద్ధి తాను కేవలం 15 నెలలలోనే చేశానని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో రాయుడు కాలనీలో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా కలెక్టర్ ద్వారా తాను విచారణ చేయించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు.