News June 4, 2024
అబ్ కీ బార్ 400 పార్ నహీ

‘అబ్ కీ బార్ 400 పార్’ నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించిన బీజేపీని ఎర్లీట్రెండ్స్ టెన్షన్ పెడుతున్నాయి. ఎన్డీయే – ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే 289, ఇండియా కూటమి 223 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. అయితే, ఎన్డీయే ఆధిక్యంలో ఉన్న 100కు పైగా స్థానాల్లో కేవలం 5 వేల మెజారిటీయే ఉండడం గమనార్హం.
Similar News
News September 13, 2025
మైథాలజీ క్విజ్ – 4

1. అర్జునుడు తపస్సు చేసి, ఎవర్ని ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రాన్ని పొందాడు?
2. శూర్పణఖ ఎవరి చెల్లి?
3. ‘త్రిసూర్ పురం’ అనే పండగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు?
4. ‘నవకళేబర’ ఉత్సవం ఏ ఆలయంలో జరుగుతుంది?
5. హిరణ్యాక్షుణ్ని వధించిన విష్ణు అవతారం ఏది?
– సరైన సమాధానాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. పై ప్రశ్నలకు జవాబులను ‘మైథాలజీ క్విజ్-5’(రేపు 7AM)లో పబ్లిష్ చేస్తాం.
News September 13, 2025
నేడు మణిపుర్లో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఇవాళ మణిపుర్లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైనప్పటి నుంచి ఆయన అక్కడికి వెళ్లడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా రూ.1,200కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఇంఫాల్, చురాచాంద్పూర్ ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో ప్రధాని సమావేశం కానున్నారు. అనంతరం మణిపుర్ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.
News September 13, 2025
ఈనెల 23 నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ

TG: దసరా కానుకగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఇందిరమ్మ చీరలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఒక్కో చీర పంపిణీ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇప్పటికే 50 లక్షల శారీల తయారీ పూర్తికాగా మరో 10 లక్షలు ప్రాసెసింగ్లో ఉన్నాయి. ఒక్కో చీర తయారీకి రూ.800 ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు.