News May 19, 2024

పోస్టింగ్ ఇప్పించాలని AB వెంకటేశ్వరరావు లేఖ

image

AP: కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ <<13207718>>తీర్పు<<>> ప్రకారం తనకు పోస్టింగ్ ఇప్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనకు పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని.. ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న తనకు న్యాయం చేయాలని కోరారు. తన సస్పెన్షన్ చెల్లదంటూ CAT ఇటీవల ఇచ్చిన తీర్పు కాపీని అందించారు. ఈ లేఖను CECకి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి పంపారు.

Similar News

News January 2, 2026

విజయవాడ పుస్తకాల పండుగ నేటి నుంచే

image

AP: 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఇందుకోసం ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 280-300 స్టాళ్లలో వేల పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈనెల 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

News January 2, 2026

చెట్టు నుంచి అరటి గెలలు ఎందుకు ఊడి పడిపోతాయి?

image

ఒక్కోసారి తోటలలోని కొన్ని అరటి చెట్ల నుంచి గెలలు హఠాత్తుగా ఊడి కిందకు పడిపోతుంటాయి. పంటకు సరైన పోషకాలు అందనప్పుడు, నీటి సదుపాయం ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే తక్కువ సూర్యకాంతి తగలడం, ఎక్కువ నీటిని పంటకు పెట్టడం, కాల్షియం లోపం కూడా దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గాలులు, గెల ఆనిన కొమ్మ విరగడం, గెల బరువు ఎక్కువగా ఉండటం కూడా గెల ఊడటానికి కారణమవుతాయి.

News January 2, 2026

నేటి సామెత: కంచె వేసినదే కమతము

image

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.