News January 28, 2025
నాలుగేళ్ల తర్వాత క్రికెట్లోకి ABD రీఎంట్రీ

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్లో సౌతాఫ్రికా తరఫున ఆడనున్నారు. 2018లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆయన, 2021 సీజన్ వరకు ఐపీఎల్లో RCB జట్టుకు ఆడారు. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్గా పనిచేశారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా క్రికెట్ మ్యాచులపై తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 21, 2025
వేరుశనగలో తుప్పు/ కుంకుమ తెగులు – నివారణ

పెరిగిన చలి తీవ్రత, తేమ వాతావరణంతో వేరుశనగలో తుప్పు లేదా కుంకుమ తెగులు వ్యాపిస్తుంది. ఈ తెగులు సోకిన మొక్క ఆకుల అడుగు భాగంలో ఇటుక రంగు/ఎరుపు రంగు చిన్న చిన్న పొక్కులు ఏర్పడి, ఆకుల పైభాగంలో పసుపు మచ్చలు కనిపిస్తాయి. ఉద్ధృతి ఎక్కువైతే ఈ పొక్కులు మొక్క అన్ని భాగాలపై కనిపిస్తాయి. తుప్పు తెగులు కట్టడికి 200 లీటర్ల నీటిలో క్లోరోథలోనిల్ 400 గ్రా. లేదా మాంకోజెబ్ 400 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
News November 21, 2025
పరమ పావన మాసం ‘మార్గశిరం’

మార్గశిర మాసం విష్ణువుకు అతి ప్రీతికరమైనది. ఈ మాసంలోనే దత్తాత్రేయుడు, అన్నపూర్ణాదేవి, కాలభైరవుడు వంటి దైవ స్వరూపులు అవతరించారు. పరాశరుడు, రమణ మహర్షి వంటి మహనీయులు జన్మించారు. భగవద్గీత లోకానికి అందిన పవిత్రమైన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. ఆధ్యాత్మికంగా ముఖ్యమైన ధనుర్మాసం ప్రారంభం, హనుమద్వ్రతం, మత్స్య ద్వాదశి వంటి పర్వదినాలు ఈ మాసంలోనే ఉన్నాయి. అందుకే ఈ మాసం ఎంతో విశేషమైందని పండితులు చెబుతారు.
News November 21, 2025
ESIC ముంబైలో సీనియర్ రెసిడెంట్ పోస్టులు

<


