News May 26, 2024
భర్త అప్పు చెల్లించలేదని భార్య అపహరణ!

TG: భర్త అప్పు చెల్లించలేదని బాకీ ఇచ్చినవారు భార్యను కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని సూరారం సుదర్శన్ నగర్‌లో జరిగింది. మాగంటి లక్ష్మణరావు తెలిసినవారి దగ్గర అప్పు చేశాడు. ఎంతకీ తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారు లక్ష్మణ్ ఇంటికి వచ్చి ఆయన భార్యను కిడ్నాప్ చేశారు. అప్పు చెల్లించేవరకూ విడిచిపెట్టమని బెదిరించారు. కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి ఆమెను విడిపించారు.
Similar News
News December 26, 2025
జగన్ ట్వీట్‌తో రంగా అభిమానుల్లో కొత్త చర్చ!

AP: వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా YCP చీఫ్ జగన్ ప్రత్యేకంగా <<18674822>>ట్వీట్<<>> చేయడం చర్చకు దారితీసింది. రంగా కుమారుడు రాధా YCPని వీడి గతంలో TDPలో చేరారు. తాజాగా కుమార్తె ఆశాకిరణ్ యాక్టివ్ అయ్యారు. భవిష్యత్తులో ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారని ఓసారి ఆమెను మీడియా అడగ్గా రాధారంగా మిత్రమండలి సలహాతో నడుస్తానన్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవాలని YCP ఆసక్తితో ఉందా? అనే సందేహాలు రంగా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి.
News December 26, 2025
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(<
News December 26, 2025
మెదడు దగ్గరి భాగాల్లో కుక్క కరిస్తే డేంజర్!

కుక్క కాటు వేసిన 14 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని, అందుకే కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా ఉండే తల, ముఖం, మెడ భాగాల్లో కరిస్తే చాలా డేంజర్ అని, దీనివల్ల రేబిస్ వైరస్ వేగంగా మెదడును చేరుతుందని తెలిపారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లతో పాటు Rabies Immuno-globulin (RIG) కచ్చితంగా తీసుకోవాలంటున్నారు.


