News October 15, 2024

ABDUL KALAM: పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ దాకా

image

శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పుట్టినరోజు నేడు. పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు ఆయన జీవన ప్రస్థానం అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన జన్మదినోత్సవాన్ని యూఎన్ఓ అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా ప్రకటించింది. భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న కూడా వరించింది. కలాం ఎప్పుడూ చెప్పే ‘కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి’ అనే సందేశం ప్రతి ఒక్కరిలో ఆలోచన రగిలిస్తుంది.

Similar News

News October 17, 2025

CBSLలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్(CBSL)ముంబై కార్పొరేట్ ఆఫీస్‌లో ట్రైనీ (అడ్మినిస్ట్రేషన్/ఆఫీస్ వర్క్) పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 20 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. పని అనుభవం గలవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/

News October 17, 2025

మహిళలకు ఎడమ కన్ను అదిరితే?

image

స్త్రీలకు తరచుగా ఎడమ కన్ను అదిరితే శుభప్రదమని పండితులు చెబుతున్నారు. ఇది త్వరలో కొత్త వస్త్రాలు, ఆనందకరమైన స్నేహాలు, భాగస్వామితో మంచి అనుబంధం వంటి శుభప్రదమైన ప్రయాణ యోగాన్ని సూచించే దైవిక సంకేతమని అంటున్నారు. కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలుంటాయని చెబుతున్నారు. అయితే వివాహితకి కుడి కన్ను అదరడం చెడు శకునం అని పేర్కొంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు, ఆటంకాలు ఎదురుకావచ్చని అంటున్నారు.

News October 17, 2025

రన్స్ చేస్తే ఓకే.. చేయలేదో!

image

INDvsAUS మధ్య 3 మ్యాచుల వన్డే సిరీస్ ఈ నెల 19 నుంచి ప్రారంభం కానుంది. దీంతో అందరి దృష్టి స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్‌లపైనే ఉంది. వచ్చే వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో స్థానం దక్కాలంటే వీరు ఈ సిరీస్‌లో రాణించడం కీలకం. అదే విఫలమయ్యారో ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే వారి ప్రాతినిధ్యంపై సెలక్షన్ కమిటీ, కోచ్ క్లారిటీ ఇవ్వలేదు. కాగా AUSలో వీరిద్దరికీ మంచి రికార్డ్ ఉంది. రోహిత్, కోహ్లీ చెరో 5 సెంచరీలు బాదారు.