News January 6, 2025
క్రికెట్ లీగ్‌లో అడుగుపెట్టిన అభిషేక్ బచ్చన్

బాలీవుడ్ నటుడు ETPL(యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్)లో అడుగుపెట్టారు. ఇటీవలే ఐసీసీ ఆమోదం పొందిన ETPL ఈ ఏడాది జులైలో ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ ప్లేయర్లతో పాటు ప్రపంచస్థాయి క్రికెటర్లు కూడా ఆడతారు. ఈ లీగ్‌లో అభిషేక్ ఓ జట్టుకు కో ఓనర్‌గా వ్యవహరించనున్నారు. కాగా అభిషేక్ ఇప్పటికే PKLలో జైపూర్ పింక్ ఫ్యాంథర్స్ జట్టుకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News January 21, 2026
ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్‌కు యాప్: తుమ్మల

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్‌ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
News January 21, 2026
పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.
News January 21, 2026
హైదరాబాద్‌లోని IIMRలో ఉద్యోగాలు

<


