News April 13, 2025
అభిషేక్ వద్ద అప్పటి నుంచే ఆ నోట్ ఉంది: హెడ్

PBKSతో నిన్నటి మ్యాచ్లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీ అనంతరం క్రేజీ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. 40 బంతుల్లోనే శతకం బాదిన క్రమంలో ఆరెంజ్ ఆర్మీకి <<16080847>>ఓ నోట్<<>> చూపించారు. దానిపై ఆ జట్టు మరో ఓపెనర్ హెడ్ స్పందించారు. ‘అభిషేక్ జేబులో ఆ నోట్ 6 మ్యాచ్ల నుంచి అలాగే ఉంది. ఉప్పల్లో అది బయటకు రావడం సంతోషంగా ఉంది’ అని అన్నారు. మరోవైపు, అభిషేక్ 55 బంతుల్లోనే 141 రన్స్ బాది మ్యాచ్ను వన్ సైడ్ చేశారు.
Similar News
News November 19, 2025
సిరిసిల్ల: అపెరల్ పార్కును సందర్శించిన ఇన్ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కును ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సందర్శించారు. గ్రీన్ నీడిల్, టెక్స్పోర్ట్ పరిశ్రమలలో వస్త్ర తయారీ దశలను క్షుణ్ణంగా పరిశీలించారు. తయారైన వస్త్రాలను ఎక్కడికి ఎగుమతి చేస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి, వారి యోగక్షేమాలను, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీశారు.
News November 19, 2025
సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు గిల్ దూరం!

SAతో తొలి టెస్టులో మెడనొప్పికి గురైన IND కెప్టెన్ గిల్ రెండో టెస్టుకు దూరమయ్యారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది. తొలి టెస్టులో బ్యాటింగ్ ఆర్డర్ వైఫల్యంతో ఘోర ఓటమి మూటగట్టుకున్న భారత్కు గిల్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బని చెప్పవచ్చు. అతడి ప్లేస్లో BCCI సాయి సుదర్శన్ను తీసుకుంది. పంత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ నెల 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ ప్రారంభం అవుతుంది.
News November 19, 2025
వాహనదారులకు ట్రాఫిక్ పోలీసుల సూచనలు

TG: చలి, పొగమంచు పెరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమున్న నేపథ్యంలో HYD ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచనలు చేశారు. ‘నెమ్మదిగా నడుపుతూ అలర్ట్గా ఉండండి. మంచులో హైబీమ్ కాకుండా లోబీమ్ లైటింగ్ వాడండి. ఎదుటి వాహనాలకు సురక్షిత దూరాన్ని మెయిన్టైన్ చేయండి. సడెన్ బ్రేక్ వేస్తే బండి స్కిడ్ అవుతుంది. మొబైల్ వాడకుండా ఫోకస్డ్గా ఉండండి. వాహనం పూర్తి కండిషన్లోనే ఉందా అని చెక్ చేసుకోండి’ అని సూచించారు.


