News November 8, 2024

అభిషేక్.. ఇలా అయితే కష్టమే!

image

టీమ్‌ఇండియా యువ బ్యాటర్ అభిషేక్ శర్మ వచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా విఫలమవుతూ వస్తున్నారు. జింబాబ్వేపై సెంచరీ మినహా మిగతా మ్యాచుల్లో 0, 10, 14, 16, 15, 4, 7 (ఇవాళ సౌతాఫ్రికాపై) స్వల్ప పరుగులకే వెనుదిరిగి నిరాశపరిచారు. రాబోయే మ్యాచుల్లో అయినా అతను రాణించాలని, లేదంటే జట్టులో చోటు కోల్పోయే ఛాన్సుందని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 9, 2024

మృతుల్లో అత్య‌ధికులు వారే.. UN ఆందోళ‌న‌

image

ఇజ్రాయెల్ భీకర దాడుల్లో అసువులు బాస్తున్న పాల‌స్తీనియ‌న్ల‌లో అత్య‌ధికులు చిన్నారులు, మ‌హిళ‌లే ఉన్న‌ట్టు UN మాన‌వ హ‌క్కుల సంఘం లెక్క‌గ‌ట్టింది. Nov 2023-Apr 2024 మధ్య మృతి చెందిన 8,119 మందిలో 44% చిన్నారులు, 26% మ‌హిళ‌లు ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. మృతుల్లో 80% నివాస స‌ముదాయాల్లోని వారే ఉన్న‌ట్టు తెలిపింది. గ‌త 13 నెల‌లుగా జ‌రుగుతున్న ఈ యుద్ధంలో 43,300 మంది పాల‌స్తీనియ‌న్లు మృతి చెందారు.

News November 9, 2024

ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న నగరాలు

image

1.టోక్యో (జపాన్)- 3.71 కోట్లు
2.ఢిల్లీ (భారత్)- 3.38 కోట్లు
3.షాంఘై (చైనా)- 2.99 కోట్లు 4.ఢాకా (బంగ్లాదేశ్)- 2.3 కోట్లు
5.సౌ పౌలో (బ్రెజిల్)- 2.28 కోట్లు 6.కైరో (ఈజిప్ట్)- 2.26 కోట్లు
7.మెక్సికో సిటీ (మెక్సికో)- 2.25 కోట్లు
8.బీజింగ్ (చైనా)- 2.21 కోట్లు
9.ముంబై (ఇండియా)- 2.16 కోట్లు
10. ఒసాకా (జపాన్)- 1.89 కోట్లు
**హైదరాబాద్ 1.10 కోట్ల జనాభాతో 32వ స్థానంలో ఉంది.

News November 9, 2024

టెస్టు సిరీస్ ఓటమి: 6 గంటల పాటు మీటింగ్!

image

స్వదేశంలో భారత్ న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ వైట్‌వాష్‌కి గురవ్వడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్, సెలక్టర్ అజిత్ అగార్కర్, బోర్డు పెద్దలు జై షా, రోజర్ బిన్నీ మధ్య 6 గంటల పాటు సుదీర్ఘంగా మీటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. రోహిత్, గంభీర్‌కు బిన్నీ, షా పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఓటమికి కారణాలపై చర్చ జరిగిందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.