News November 25, 2024
ఐశ్వర్యపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన అభిషేక్

త్వరలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో భార్య ఐశ్వర్యరాయ్‌పై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నా అంటే ఇంట్లో ఐశ్వర్య ఉందన్న ధైర్యమే. అందుకు నేను అదృష్టవంతుడిని. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా తండ్రిని మూడో వ్యక్తిగా చూడరు. ఎందుకంటే వారికి పేరెంట్స్ ఇద్దరూ ఒక్కటే’ అని చెప్పారు.
Similar News
News December 19, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

బల్మెర్ లారీలో 15 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. వీటిలో అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, జూనియర్ ఆఫీసర్, తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి ఎంబీఏ, పీజీ, డిప్లొమా, బీఈ, బీటెక్, సీఏ, ICWA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.40,000-రూ.1,60,000 వరకు చెల్లిస్తారు. ఇంటర్వ్యూ/రాత పరీక్ష/గ్రూప్ డిస్కషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.balmerlawrie.com
News December 19, 2025
ఆసియా యూత్ పారా గేమ్స్‌లో సత్తా చాటిన హైదరాబాద్ బాలిక

ఆసియా యూత్ పారా గేమ్స్‌లో తెలుగు ప్లేయర్ గంగపట్నం విజయ దీపిక టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణం, కాంస్యం గెలిచింది. హైదరాబాద్‌కు చెందిన దీపిక టీటీ మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణం, మహిళల సింగిల్స్‌లో కాంస్యం సొంతం చేసుకుంది. 15 ఏళ్ల దీపిక కాంటినెంటల్ స్థాయిలో స్వర్ణం గెలిచిన పిన్న వయస్కురాలిగా ఘనత సాధించింది. దీపిక తల్లి అరుణ వెటరన్ టెన్నిస్ ప్లేయర్. సోదరుడు విజయ్ తేజ్ జాతీయ స్థాయి టెన్నిస్ ప్లేయర్.
News December 19, 2025
24,000 మంది పాక్ బిచ్చగాళ్లను వెనక్కి పంపిన సౌదీ

వ్యవస్థీకృత భిక్షాటనకు పాల్పడుతున్న పాకిస్థానీలపై గల్ఫ్ దేశాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. భిక్షాటన చేస్తున్న దాదాపు 24,000 మందిని 2025లో సౌదీ వెనక్కి పంపగా.. దుబాయ్ 6,000, అజర్బైజాన్ 2,500 మందిని బహిష్కరించాయి. మరోవైపు పెరుగుతున్న నేరాల కారణంగా పాకిస్థానీలపై UAE వీసా ఆంక్షలు విధించింది. అక్రమ వలసలు, భిక్షాటన ముఠాలను అరికట్టేందుకు పాక్ FIA స్వదేశీ విమానాశ్రయాల్లో 66,154 మందిని అడ్డుకుంది.


