News April 13, 2025

అభిషేక్.. రప్పా.. రప్పా!

image

IPL: 246 పరుగుల భారీ లక్ష్యఛేదనలో SRH దుమ్మురేపుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ 40 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నారు. 6 సిక్సర్లు, 11 ఫోర్లతో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. మరో ఓపెనర్ హెడ్ (37 బంతుల్లో 66) మెరుపులు మెరిపించి ఔటయ్యారు. SRH విజయానికి మరో 42 బంతుల్లో 71 పరుగులు అవసరం.

Similar News

News December 28, 2025

జియో, NSE, ఓయో.. 2026లో IPOల జాతర

image

2025లో IPOల జోరు తర్వాత 2026లో ఏకంగా రూ.1 లక్ష కోట్ల సందడి మొదలుకానుంది. దలాల్ స్ట్రీట్‌లోకి దిగ్గజ కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. అందరూ ఎదురుచూస్తున్న జియో, NSE, ఫోన్‌పే IPOలు వచ్చే ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్, జెప్టో, ఓయో, బోట్ వంటి బడా కంపెనీలు కూడా లిస్టింగ్ రేసులో ఉన్నాయి. SBI MF, ఫ్రాక్టల్ అనలిటిక్స్ వంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లను ఊరించనున్నాయి.

News December 28, 2025

2025: ‘అంచనాలు’ అందుకోలేకపోయారు?

image

ఈ ఏడాది పలువురు టాలీవుడ్ హీరోల సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. విడుదలకు ముందు బజ్ ఉన్నా రిలీజ్ తర్వాత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విష్ణు ‘కన్నప్ప’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, రవితేజ ‘మాస్ జాతర’ లిస్టులో ఉన్నాయి. ఈ ఏడాది రిలీజైన వాటిలో మిమ్మల్ని నిరాశపర్చిన సినిమా ఏంటి?

News December 28, 2025

శివాజీకి మహిళా కమిషన్ ప్రశ్నలివే..!

image

నిన్న మహిళా కమిషన్ శివాజీకి సంధించిన ప్రశ్నలు బయటకు వచ్చాయి.
*మహిళల డ్రెస్సింగ్ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇది మీకు తెలియదా?
*మీ కామెంట్స్ మహిళలపై దాడులు పెంచే విధంగా ఉన్నాయని ఫిర్యాదులొచ్చాయి. మీ సమాధానం?
>తాను మాట్లాడిన రెండు అసభ్యపదాలకు సారీ చెబుతున్నానన్న శివాజీ.. <<18646239>>మిగతా<<>> స్టేట్‌మెంట్‌కు కట్టుబడి ఉన్నట్లు చెప్పారని సమాచారం.