News July 7, 2024
రోహిత్ రికార్డును బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ

ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక సిక్సులు(50) కొట్టిన ఇండియన్ బ్యాటర్గా అభిషేక్ శర్మ నిలిచారు. రోహిత్ శర్మ(46) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. ఇవాళ జింబాబ్వేతో రెండో టీ20లో అభిషేక్ 8 సిక్సులు బాదారు. ఈ ఏడాది ఐపీఎల్లో అతను 42 సిక్సులు నమోదు చేసి టోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.
Similar News
News October 24, 2025
కాసేపట్లో భారీ వర్షం..

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.
News October 24, 2025
భారత తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్

అనేక పురుషాధిక్య రంగాల్లో ప్రస్తుతం మహిళలు కూడా సత్తా చాటుతున్నారు. కానీ 1965లో ఒక మహిళ యుద్ధక్షేత్రంలోకి దిగి ఇండియా-పాకిస్తాన్ యుద్ధాన్ని రిపోర్ట్ చేసిందంటే నమ్మగలరా.. ఆమే భారతదేశపు తొలి మహిళా వార్ జర్నలిస్ట్ ప్రభాదత్. ఆమె ఏం చేసినా సెన్సేషనే. ఎన్నో స్కాములను ఆమె బయటపెట్టారు. ఎన్నో బెదిరింపులు, భౌతిక దాడులను ఎదుర్కొన్నా వెనుకడుగు వేయలేదు. అందుకే ఆమెను చమేలీ దేవీ జైన్ అవార్డ్ వరించింది.
News October 24, 2025
లిక్కర్ స్కామ్ కేసు.. రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురు నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు నవంబర్ 7 వరకు రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టు కాగా ఐదుగురు బెయిల్పై విడుదలయ్యారు. ఏడుగురు నిందితులు రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేశ్ నాయుడు, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ విజయవాడ, గుంటూరు జిల్లా జైళ్లలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.


