News September 26, 2025

చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ

image

అభిషేక్ శర్మ SLతో మ్యాచ్‌లో రికార్డులు బద్దలు కొట్టారు. T20 ఆసియా కప్‌‌లో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రిజ్వాన్(281) పేరిటున్న రికార్డును బ్రేక్ చేశారు. IND తరఫున ఒకే టోర్నీలో 300+ రన్స్ చేసిన తొలి ప్లేయర్‌(309*)గా నిలిచారు. అలాగే తక్కువ బంతుల్లో 50 చేసిన ప్లేయర్లలో రోహిత్(6సార్లు) రికార్డు సమం చేశారు. వరుసగా ఎక్కువసార్లు 30+ స్కోర్ చేసిన ప్లేయర్‌గా రిజ్వాన్, రోహిత్(7) సరసన చేరారు.

Similar News

News February 12, 2026

3rd క్లాసు నుంచే ఏఐ: ధర్మేంద్ర ప్రధాన్

image

AI రంగంలో భారత్ శరవేగంగా వృద్ధి చెందుతోందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. మూడో తరగతి నుంచి అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ చేసే విద్యార్థుల వరకు AIని అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన AI కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడారు. ‘దేశంలో మేథో సామర్థ్యానికి లోటు లేదు. AIపై ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మెషీన్ ఇంటెలిజెన్స్‌, భావోద్వేగాల కలయికతో AIని సృష్టిస్తే అద్భుతాలు చేయొచ్చు’ అని తెలిపారు.

News February 12, 2026

భారత్ వర్సెస్ పాకిస్థాన్, బంగ్లాదేశ్

image

T20 WCలో ఈ నెల 15న భారత్-పాకిస్థాన్ మధ్య హైటెన్షన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇది భారత్ వర్సెస్ పాకిస్థాన్ & బంగ్లాదేశ్‌గా చూస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇండియాతో వైరం వల్ల WC నుంచి బంగ్లా తప్పుకుంది. దానిపై మొసలి కన్నీరు కారుస్తూ PAK దగ్గరైంది. ఆ 2 దేశాలు ఏకమై మనపై ప్రతీకారం తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. కానీ పాక్, బంగ్లాను మన కుర్రాళ్లు చావుదెబ్బ కొడతారని IND ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.

News February 12, 2026

విచారణకు రావాలని కాకాణికి నోటీసులు

image

AP: YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీచేశారు. నెల్లూరు జిల్లా కోవూరులోని గుమ్మలళ్లదిబ్బలో గంజాయి బ్యాచు చేతిలో అఘాయిత్యానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈనెల 14న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు వైసీపీ Xలో పేర్కొంది. ప్రశ్నించడమే నేరమన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించింది.