News October 13, 2024
మరోసారి నిరాశపర్చిన అభిషేక్ శర్మ

టీమ్ ఇండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశ పరిచారు. ఈ సిరీస్‌లో అభి వరుసగా 16, 15, 4 పరుగులే చేశారు. దీంతో అంచనాలకు తగ్గట్లుగా అతడు రాణించలేకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. అంతర్జాతీయ కెరీర్లో వచ్చిన ఛాన్స్‌లను ఆయన వృథా చేసుకుంటున్నారని కామెంట్లు చేస్తున్నారు. ఇలాగే ఆడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోసారి జట్టులో చోటు దక్కడం కష్టమని చెబుతున్నారు.
Similar News
News December 18, 2025
తాడిచర్ల సర్పంచ్‌కు భారీ మెజార్టీ

జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో తాడిచర్ల సర్పంచిగా బండి స్వామి విజయం సాధించి రికార్డు సృష్టించారు. గ్రామంలో 5,157 ఓట్లు పోలవగా, కాంగ్రెస్ బలపరిచిన బండి స్వామికి 3,394 ఓట్లు లభించాయి. సమీప ప్రత్యర్థి రావుల కల్పనకు కేవలం 831 ఓట్లు వచ్చాయి. దీంతో స్వామి 2,563 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థాయిలో మెజారిటీ రావడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మద్దతుదారుల సంబరాలు మిన్నంటాయి.
News December 18, 2025
గతేడాదితో పోలిస్తే నేరాలు తగ్గుముఖం: DGP

AP: గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయని DGP హరీశ్ గుప్తా పేర్కొన్నారు. ‘2023-24లో 1,10,111 నేరాలు నమోదైతే 2024-25లో 1,04,095 దాఖలయ్యాయి. అల్లర్లు 52.4%, SC, STలపై నేరాలు 22.35%, స్త్రీలపై అకృత్యాలు 22.35% తగ్గాయి. 4 నెలల్లో 2,483 మంది అదృశ్యమైన మహిళల ఆచూకీ కనుగొన్నాం. వారిలో 1177 మంది యువతులున్నారు’ అని తెలిపారు. 55% మేర రికవరీ రేటు సాధించామని డీజీపీ వెల్లడించారు.
News December 18, 2025
భారత జట్టుకు ఆడిన పాక్ ప్లేయర్.. విచారణకు ఆదేశం

పాకిస్థాన్ కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్ భారత్ తరఫున ఆడటం వివాదాస్పదంగా మారింది. బహ్రెయిన్‌లో జరిగిన ఓ టోర్నీలో అతడు ఇండియన్ జెర్సీ, జెండాతో కనిపించడంపై PKF విచారణకు ఆదేశించింది. అనధికారిక మ్యాచ్‌లో అనుమతి లేకుండా ఆడారని పీకేఎఫ్ సెక్రటరీ రాణా సర్వార్ తెలిపారు. దీనిని ఉపేక్షించబోమని, విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరోవైపు రాజ్‌పుత్ క్షమాపణలు చెప్పారు.


