News September 24, 2025

ఆస్ట్రేలియాతో ODI సిరీస్‌కు అభిషేక్ శర్మ?

image

యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ T20ల్లో అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో అతనికి వన్డేల్లో చోటు దక్కనుందనే ప్రచారం జరుగుతోంది. టీమ్ ఇండియా వచ్చేనెల ఆస్ట్రేలియాలో 3 వన్డేలు, 5 T20లు ఆడనుంది. వన్డే స్క్వాడ్‌లో అభిషేక్ ఉంటారని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రారంభంకానుంది. మరోవైపు ఆసియా కప్‌లో అభిషేక్ టాప్ స్కోరర్(173)గా ఉన్నారు.

Similar News

News February 6, 2026

శ్రీవారిని ఉచితంగా దర్శించుకోండిలా!

image

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే సాధారణ భక్తుల కోసం టీటీడీ పలు ఉచిత దర్శన మార్గాలను కల్పిస్తోంది. సర్వదర్శనం కోసం జనరల్ క్యూలో వెళ్లొచ్చు. టైమ్ స్లాట్ SSD టోకెన్స్‌తో పాటు మెట్ల నడక ద్వారా కొండపైకి వెళ్లి బయోమెట్రిక్ టోకెన్స్ పొందవచ్చు. స్థానిక భక్తులకు లోకల్ కోటా, సీనియర్ సిటిజన్లకు(65+) స్పెషల్ ఎంట్రీతో పాటు ఏడాదిలోపు పిల్లలున్న పేరెంట్స్ ‘సుపథం’ ద్వారా శ్రీవారిని వేగంగా దర్శించుకోవచ్చు.

News February 6, 2026

ఇప్పటివరకు U-19 మెన్స్ ప్రపంచకప్ విజేతలు

image

భారత్ అన్ని జట్ల కంటే ఎక్కువగా 6 సార్లు ప్రపంచకప్ సాధించింది.
1988- ఆస్ట్రేలియా, 1998- ఇంగ్లండ్
2000- భారత్, 2002- ఆస్ట్రేలియా
2004- పాకిస్థాన్, 2006- పాకిస్థాన్
2008- భారత్, 2010- ఆస్ట్రేలియా
2012- భారత్, 2014- సౌతాఫ్రికా
2016- వెస్టిండీస్, 2018- భారత్
2020- బంగ్లాదేశ్, 2022- భారత్
2024- ఆస్ట్రేలియా, 2026- భారత్

News February 6, 2026

బంగ్లా ఎన్నికలు: మ్యానిఫెస్టోల్లో ఇండియా, హిందువుల ప్రస్తావన

image

Feb 12న బంగ్లాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని BNP ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో హిందువుల ఆస్తులు, ప్రార్థనా స్థలాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. భారత్‌ను యజమానిలా కాకుండా మిత్రుడిలా చూస్తామని పేర్కొంది. మరోవైపు జమాత్-ఎ-ఇస్లామీ భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపినా హిందువుల రక్షణపై మాత్రం మౌనం వహించింది.