News April 9, 2025
ABHISHEK: పించ్ హిట్టర్‌కి సిక్సర్ల కరవు!

ఐపీఎల్ 2025లో SRH విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మ తేలిపోతున్నారు. గత సీజన్‌లో అత్యధికంగా 42 సిక్సర్లు బాది టాప్‌లో నిలిచారు. కానీ ఈ సీజన్‌లో 5 మ్యాచులాడి ఒక్కటంటే ఒక్క సిక్సర్ కూడా కొట్టలేకపోయారు. పవర్ ప్లేలోనే ఆయన పెవిలియన్ బాట పడుతున్నారు. RR-24, LSG-6, DC-1, KKR-2, GTపై 18 పరుగులు మాత్రమే చేసి నిరాశ పరిచారు. తర్వాతి మ్యాచుల్లోనైనా అభిషేక్ విజృంభించి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News December 9, 2025
VZM: మహిళల కోసం ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనం

విజయనగరం కలెక్టరేట్‌లో మహిళల అత్యవసర సేవల కోసం ఏర్పాటు చేసిన ‘వన్ స్టాప్ హెల్ప్ లైన్’ వాహనాన్ని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనం ద్వారా హింసకు గురైన మహిళలకు వైద్య, పోలీస్, చట్ట సహాయం, కౌన్సిలింగ్, తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలను ఒకే చోట అందించనున్నట్లు తెలిపారు. 24/7 పనిచేసే ఈ వాహనాలు టోల్ ఫ్రీ నంబర్ 181 ద్వారా మహిళలకు అందుబాటులో ఉంటాయన్నారు.
News December 9, 2025
వరల్డ్ టాప్ డిఫెన్స్ కంపెనీల జాబితాలో HAL

వరల్డ్ TOP-100 డిఫెన్స్ కంపెనీల జాబితాలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 44వ స్థానంలో నిలిచింది. BEL 58, మజ్గాన్ డాక్ 91 ర్యాంకుల్లో నిలిచాయని SIPRI నివేదిక పేర్కొంది. ప్రపంచ ఉద్రిక్తతలతో 2024లో జాబితాలోని 77 కంపెనీల ఆదాయం పెరిగినట్లు తెలిపింది. కాగా ఇండియా ఆయుధ విక్రయాలు 8.2% పెరిగి $7.5B ఆదాయం సమకూరింది. ఆయుధ ఆదాయంలో 49% వాటా USదే. చైనా 13%, UK 7.7%, రష్యా 4.6% ఇండియా 1.1% వాటా కలిగి ఉన్నాయి.
News December 9, 2025
నగలను ఎలా శుభ్రం చేయాలంటే?

నగలను సరిగా శుభ్రం చేయకపోతే చెమట, దుమ్ము చేరి వాటి మెరుపు తగ్గిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే గోరువెచ్చని నీటిలో షాంపూ/ డిష్ వాష్ డిటర్జెంట్ కలిపి నగలను పావుగంట ఉంచాలి. తర్వాత టూత్ బ్రష్తో మృదువుగా రుద్దాలి. తర్వాత మంచినీటిలో రెండుసార్లు శుభ్రపరిచి పొడివస్త్రంలో వేసి మునివేళ్లతో అద్దాలి. తడి ఆరనిచ్చి, భద్రపరుచుకోవాలి. షాంపూకి బదులు కుంకుడు రసం కూడా వాడి నగలను శుభ్రం చేయొచ్చు.


