News January 13, 2025
సెలవు రోజును నాశనం చేశారు.. ఇండిగోపై అభిషేక్ ఆగ్రహం

ఇండిగో ఎయిర్లైన్స్ సిబ్బందిపై యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్స్టాలో మండిపడ్డారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు సరైన సమయానికే చేరుకున్నప్పటికీ మేనేజర్ సుస్మిత వేరే కౌంటర్లకు తిప్పడంతో ఫ్లైట్ మిస్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది సాయం చేయకపోగా దురుసుగా ప్రవర్తించారన్నారు. తనకు వచ్చిన ఒక రోజు హాలిడేను నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో అభిషేక్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
Similar News
News January 22, 2026
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం, వెండి ధరలు ఇవాళ శాంతించాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,290 తగ్గి రూ.1,54,310కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,100 పతనమై రూ.1,41,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.5వేలు తగ్గి రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 22, 2026
ట్రంప్ ఎఫెక్ట్.. భారీ లాభాల్లో మార్కెట్లు

యూరప్ దేశాలపై టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్ 649 పాయింట్లు ఎగబాకి 82,559 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 196 పాయింట్లు పెరిగి 25,372 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో అన్ని షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఎటర్నల్, ఏషియన్ పెయింట్స్, SBI, అదానీ పోర్ట్స్, BEL షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News January 22, 2026
అప్పుడు అలాస్కా.. ఇప్పుడు గ్రీన్లాండ్: ఇలా కొనుక్కోవచ్చా?

అంతర్జాతీయ చట్టాల ప్రకారం పరస్పర ఒప్పందంతో ఇతర దేశాల భూభాగాలను కొనడం సాధ్యమే. 1867లో $7.2Mతో రష్యా నుంచి అలాస్కాను US కొనుగోలు చేసింది. ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అలాంటి చర్చలే జరుగుతున్నాయి. గ్రీన్లాండ్ ప్రస్తుత విలువ సుమారు $700B పైమాటే. అయితే నేటి ఆధునిక చట్టాల ప్రకారం.. కేవలం డబ్బుతోనే కాకుండా ప్రభుత్వాల మధ్య అంగీకారం, స్థానిక ప్రజల ఆమోదం తప్పనిసరి. బలవంతపు ఆక్రమణకు UN రూల్స్ ఒప్పుకోవు.


