News November 24, 2024
‘ఫార్మాసిటీ’ గెజిట్‌ను రద్దు చేయండి: హరీశ్‌రావు
TG: లగచర్లలో ఫార్మాసిటీ ఏర్పాటుచేస్తున్నట్లు జులై 19న గెజిట్ విడుదల చేసి ఇప్పుడు పారిశ్రామిక కారిడార్ అని సీఎం రేవంత్ అబద్ధాలు చెబుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. వెంటనే పాత గెజిట్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. సీఎం లగచర్లకు వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడాలని, పోలీసులను ప్రయోగిస్తే కుదరదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమి తర్వాతైనా కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని సూచించారు.
Similar News
News November 24, 2024
అమ్ముడుపోని వార్నర్
డేవిడ్ వార్నర్ వేలంలో అమ్ముడుపోలేదు. మూడో సెట్లో ఆయన పేరు రాగా తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తిని చూపించలేదు. గత సీజన్లో ఢిల్లీ తరఫున ఆడిన వార్నర్ ఇటీవలి ప్రదర్శన అంతంతమాత్రమే. ఇక ఆస్ట్రేలియా తరఫున ఆయన అన్ని ఫార్మాట్లలోనూ రిటైర్ కావడం కూడా ఫ్రాంచైజీల అనాసక్తికి కారణం కావొచ్చని అంచనా.
News November 24, 2024
RTMలో జాక్ మెక్‌గర్క్‌కు రూ.9కోట్లు
విధ్వంసకర ఓపెనర్ బ్యాటర్ జాక్ మెక్‌గర్క్‌ను ఢిల్లీ రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన ఇతని కోసం పంజాబ్, ఢిల్లీ పోటీ పడ్డాయి. RTM విధానంలో ఢిల్లీ మెక్‌గర్క్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌గా వచ్చి ఇతను భారీ హిట్లు కొట్టగలరు.
News November 24, 2024
రాజ్యాంగం డాక్యుమెంట్ కాదు.. ఓ ప్రయాణం: కిరణ్ రిజిజు
ప్రధాని మోదీ రాజ్యాంగ పరిరక్షకుడని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కొనియాడారు. రాజ్యాంగం అంటే ఒక స్థిరమైన డాక్యుమెంట్ కాదని, అదొక ప్రయాణమని తెలిపారు. దానికి అనేక సవరణలు జరిగాయని పేర్కొన్నారు. ‘రాజ్యాంగం గురించి చెప్పడం ఒక నిమిషంలో సాధ్యం కాదు. దాని ప్రాథమిక సిద్ధాంతాలను మనం టచ్ చేయలేం. కానీ మన ప్రజాస్వామ్య దేశంలో ఏదీ పర్మినెంట్ కాదు’ అని చెప్పారు. ఈ నెల 26న రాజ్యాంగదినోత్సవం నిర్వహిస్తామన్నారు.