News April 13, 2025
పరస్పర సుంకాలను రద్దు చేయండి: చైనా

పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని అమెరికాను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది. ట్రంప్ తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లను టారిఫ్స్ నుంచి మినహాయిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా చిన్నది అని తెలిపింది. తమ దేశంపై 145% సుంకం విధించడాన్ని తప్పుబట్టింది. ‘పులి మెడలోని గంటను దానిని కట్టిన వ్యక్తి మాత్రమే విప్పగలడు’ అని పేర్కొంది.
Similar News
News April 15, 2025
యూరిన్ ఆపుకుంటున్నారా?

బిజీగా ఉండటం, వాష్‌రూమ్స్ అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో మూత్ర విసర్జనను ఆపుకుంటూ ఉంటాం. ఇది తరుచూ జరిగితే మూత్రాశయం సాగి కండరాలు బలహీనమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్లు పెరుగుతాయని, కిడ్నీలపై భారం పెరిగి వాటి పనితీరు దెబ్బతింటుందంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడతాయని పేర్కొంటున్నారు. సరిపడా నీళ్లు తాగుతూ ఎప్పటికప్పుడు మూత్రవిసర్జన చేయాలని సూచిస్తున్నారు.
News April 15, 2025
జపాన్‌లో రికార్డు స్థాయిలో తగ్గిన జనాభా!

జపాన్‌లో ‘యువశక్తి’ విషయంలో సంక్షోభం కొనసాగుతోంది. 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది. మరోవైపు జననాల రేటు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నా.. యువత వివిధ కారణాల వల్ల వివాహం, పిల్లల విషయంలో ఆలస్యం చేస్తోంది. దీంతో ప్రపంచంలోనే జపాన్ అత్యల్ప బర్త్ రేట్‌ను నమోదు చేసింది.
News April 15, 2025
సూడాన్‌లో కాల్పులు.. 300 మంది మృతి

సూడాన్‌లో ఇటీవల <<16082587>>పారామిలటరీ RSF జరిపిన కాల్పుల్లో<<>> మృతుల సంఖ్య 300 దాటినట్లు UN హ్యుమానిటీ ఏజెన్సీ వెల్లడించింది. వీరిలో 10 మంది ఐరాస సిబ్బంది కూడా ఉన్నట్లు పేర్కొంది. మృతుల్లో 23 మంది చిన్నారులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కాల్పుల భయంతో 16వేల మంది జామ్జామ్ వలస శిబిరాన్ని వీడినట్లు సమాచారం. దాడులను UN చీఫ్ గుటెర్రస్ ఖండించారు. శత్రుత్వాన్ని వీడి ప్రజలకు రక్షణ కల్పించాలని పిలుపునిచ్చారు.