News July 3, 2024
దేవుడిని ప్రార్థిస్తున్నాడని ఉరి శిక్ష రద్దు!

రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని ఓ ఖైదీకి ఒడిశా హైకోర్టు ఉరి శిక్ష రద్దు చేసింది. 2014లో జగత్సింగ్పూర్ జిల్లాలో అఖీల్ అలీ, ఆసిఫ్ అలీ ఆరేళ్ల చిన్నారిపై రేప్ చేసి, చంపేశారు. వీరికి 2022లో పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. ఆసిఫ్ రోజూ దేవుడిని ప్రార్థిస్తున్నాడని, నేరాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడంటూ హైకోర్టు మరణ శిక్షను జీవిత ఖైదుకు తగ్గించింది. అఖీల్ అలీని నిర్దోషిగా ప్రకటించింది.
Similar News
News November 24, 2025
ఐబొమ్మ రవి ఎలా చిక్కాడంటే?

ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఇప్పటివరకు అతడు వెబ్సైట్లకు సంబంధించి ఎలాంటి కీలక సమాచారం చెప్పలేదని తెలుస్తోంది. దీంతో కోర్టులో హాజరుపర్చి మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. ఇక రవి అరెస్టుపై కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. HYD వచ్చిన రవి ఫ్లాట్‌కు రమ్మంటూ తన ఫ్రెండ్‌కు మెసేజ్ చేశాడు. అప్పటికే ఫ్రెండ్ నంబర్ సంపాదించిన పోలీసులు మెసేజ్ రాగానే వెళ్లి రవిని అరెస్ట్ చేశారు.
News November 24, 2025
నకిలీ వెబ్సైట్ల కలకలం.. శ్రీశైలం భక్తులకు అలర్ట్

AP: శ్రీశైలంలో వసతులు కల్పిస్తామంటూ AP టూరిజం, శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్ల ద్వారా దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి ₹30Kతో రూమ్స్ బుక్ చేశారు. అక్కడికి వచ్చి రశీదు చూపించగా సిబ్బంది నకిలీదని చెప్పడంతో షాకయ్యారు. ఇలాగే పలువురు మోసాలకు గురయ్యారు. దీంతో ఆయా వెబ్సైట్లపై సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు EO శ్రీనివాసరావు తెలిపారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
News November 24, 2025
ఎన్నికలపై విచారణ వాయిదా

TG: పంచాయతీ ఎన్నికలపై హైకోర్టులో ఇవాళ జరగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ పిటిషన్ రేపు విచారణకు రానుంది. కాగా కోర్టు ఆదేశాల మేరకు 50% రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని న్యాయస్థానానికి ప్రభుత్వం తెలియజేయనుంది.


