News October 29, 2024

ఇళ్ల కనెక్షన్లకు కనీస కరెంట్ ఛార్జీ రద్దు

image

TG: ఇళ్లలో కరెంట్ అసలేం వాడుకోకపోయినా గతంలో కనీస ఛార్జీ కింద రూ.30 చెల్లించాల్సి వచ్చేది. దాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఇది గృహజ్యోతికి అర్హులు కాని వారికి ఉపయోగపడనుంది. గృహేతర/వాణిజ్య పరంగా 50 యూనిట్లలోపు కరెంట్ వాడే వారికి ఫిక్స్‌డ్ ఛార్జీలను కిలోవాట్‌కు రూ.60 నుంచి రూ.30 తగ్గించింది. ఇదే కేటగిరీలో కనీస ఎనర్జీ ఛార్జీలను సింగిల్ ఫేజ్‌కు రూ.65-50కి, త్రీఫేజ్‌కు రూ.200-100కు తగ్గించింది.

Similar News

News December 2, 2025

ఫైనల్స్‌కు మహబూబ్‌నగర్- వరంగల్ బాలికల జట్లు

image

సిరిసిల్లలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్, వరంగల్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈరోజు ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించగా, రెండో సెమీ ఫైనల్‌లో వరంగల్ జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.

News December 2, 2025

రొయ్యల చెరువు అడుగు పాడైనట్లు ఎలా గుర్తించాలి?

image

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.

News December 2, 2025

పవన్ సారీ చెబుతారా?

image

కోనసీమకు <<18446578>>దిష్టి<<>> తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పలువురు తెలంగాణ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పవన్‌ను బహిరంగంగానే తప్పు పడుతూ వెంటనే సారీ చెప్పాలని మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కాస్త ఆలోచించి మాట్లాడి ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పవన్ సారీ చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.