News August 25, 2024

N-కన్వెన్షన్‌ కూల్చివేత: అభిమానులకు నాగార్జున రిక్వెస్ట్

image

N-కన్వెన్షన్‌పై వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయని నాగార్జున చెప్పారు. ‘పట్టా డాక్యుమెంటెడ్ భూమిలోనే కన్వెన్షన్ నిర్మాణం జరిగింది. ఒక్క సెంటూ ఆక్రమించలేదు. చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్టు 2014 FEB 24న తీర్పు ఇచ్చింది. నిర్మాణ చట్టబద్ధతపై మళ్లీ హైకోర్టును ఆశ్రయించాం. తీర్పుకు కట్టుబడి ఉంటా. అప్పటివరకు అవాస్తవాలు నమ్మొద్దని అభిమానులను కోరుతున్నా’ అని Xలో పోస్టు చేశారు.

Similar News

News November 28, 2025

విషపు ఎరలతో కీరదోసలో పండు ఈగ నివారణ

image

కీరదోసను ఆశించే పండు ఈగలు పువ్వు మొగ్గలపై, లేత పిందెలపైన గుడ్లు పెడతాయి. వీటి నుంచి వచ్చే పిల్ల పురుగులు కాయను తొలచి, లోపలి గుజ్జును తింటాయి. దీని వల్ల కాయలు కుళ్లిపోతాయి. వీటి కట్టడికి 10 లీటర్ల నీటిలో మలాథియాన్‌ 100ml, బెల్లం 100 గ్రాములను కలిపి మట్టి గిన్నెలో పోసి ఎకరాకు 10-12 చోట్ల ఉంచాలి. దీనిలో పులిసిన కల్లు మడ్డి కలిపితే తల్లి పండు ఈగలు మరింత ఆకర్షింపబడి ఈ విషపదార్థాన్ని తిని చనిపోతాయి.

News November 28, 2025

APPLY NOW: ఉమెన్ డెవలప్‌మెంట్ & చైల్డ్ వెల్ఫేర్‌లో ఉద్యోగాలు

image

AP: బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్‌మెంట్ ఆఫీస్‌లో 8 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS, ఇంటర్, BA(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, B.Ed, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bapatla.ap.gov.in/

News November 28, 2025

మహిళల్లో ఊబకాయంతో పక్షవాతం ముప్పు

image

టీనేజ్ నుంచి అధికబరువుతో బాధపడుతున్న మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే ముప్పు పెరుగుతున్నట్లు అమెరిన్‌ స్ట్రోక్‌ అసోసియేషన్‌ పరిశోధనలో వెల్లడైంది. చిన్న వయసు నుంచి పెద్దయ్యే దాకా ఊబకాయం లేనివారితో పోలిస్తే.. ఏదో ఒక వయసులో ఊబకాయం ఉన్నవారిలో ముందుగానే పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కనుగొన్నారు. దీంతోపాటు షుగర్‌, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బుల ప్రమాదం కూడా పెరుగుతుందని అంటున్నారు.