News May 1, 2024

రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ అజెండా: రేవంత్

image

TG: రిజర్వేషన్లను రద్దు చేయాలనేదే RSS మూల సిద్ధాంతమని, దాన్ని అమలు చేయడమే BJP అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ‘వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు రాజ్యాంగంపై సమీక్షించాలని ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. అప్పటి రాష్ట్రపతి ప్రసంగ సారాంశంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉంది. ఆధారాలతో సహా నేను వాదిస్తున్నా. మూడింట రెండొంతుల మెజార్టీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటున్నారు’ అని రేవంత్ తెలిపారు.

Similar News

News March 31, 2026

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: JC

image

మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ యువతకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించి జేసీ మాట్లాడారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా సంస్థలలో మాదక ద్రవ్యాలు ప్రవేశించకుండా గట్టి నిఘా పెట్టాలని తెలిపారు. యువత మత్తులో పడితే జీవితం చిత్తు అవుతుందన్నారు. కుటుంబాలు ఆర్థికంగా నష్ట పోతాయన్నారు.

News March 31, 2026

పరారీలో ఖైదీ.. గ్యాస్ బుక్ చేసి దొరికిపోయాడు!

image

కర్ణాటకలో భార్యను హత్య చేసి, నాలుగేళ్లుగా పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న సందీప్ తోమర్ అనే మాజీ జవాన్ చివరకు గ్యాస్ బుకింగ్ వల్ల దొరికిపోయాడు. 2014లో జీవిత ఖైదు పడిన ఇతను.. బెయిల్‌పై వచ్చి 2022 నుంచి పరారీలో ఉన్నాడు. నిందితుడి పాన్ కార్డుకు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేయడంతో పోలీసులు అతడిని ట్రాక్ చేశారు. MPలోని పాండుర్నాలో మాటువేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

News March 31, 2026

ట్రంప్‌కు షాకిచ్చిన ఇటలీ!

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ఇటలీ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనే US విమానాలకు ఇటలీ ఎయిర్‌స్పేస్‌ను మూసేసినట్లు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది. అలాగే సిసిలీలో ఉన్న తమ వైమానిక స్థావరాన్ని వాడుకోవడానికీ అనుమతి నిరాకరించినట్లు తెలిపింది. యూఎస్ బాంబర్ విమానాలను నిలపడానికి అమెరికా విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కాగా ఇటీవల స్పెయిన్ సైతం <<19516561>>ఇలాంటి ప్రకటనే<<>> చేసిన విషయం తెలిసిందే.