News July 11, 2024
వైద్య విధాన పరిషత్ రద్దు?

TG: వైద్య సేవల్లో కీలకంగా ఉన్న వైద్య విధాన పరిషత్ రద్దుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు చేయనుందని సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టనుందట. ప్రతి 30KMల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం అందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వై.వి.ప. పరిధిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా, జిల్లా ఆసుపత్రులు ఉన్నాయి.
Similar News
News November 7, 2025
మరో 4 ‘వందేభారత్’లు.. ఎల్లుండి ప్రారంభం

దేశంలో మరో 4 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. లక్నో-సహరన్పూర్, ఎర్నాకుళం-బెంగళూరు, బనారస్-ఖజురహో, ఫిరోజ్పూర్-ఢిల్లీ మార్గాల్లో ఇవి నడవనున్నాయి. ఎల్లుండి ఉదయం 8.15 గంటలకు వారణాసిలో ప్రధాని మోదీ ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. కాగా ఆగస్టు నాటికి దేశంలో 150 వందేభారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయి. గరిష్ఠంగా గంటకు 180 కి.మీ వేగంతో ప్రయాణిస్తాయి.
News November 7, 2025
మంత్రులు, అధికారులకు సీఎం వార్నింగ్

AP: ఫైల్స్ క్లియరెన్స్లో అలసత్వం జరుగుతోందని సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. మంత్రులు, అధికారులు తమ పనిలో కమిట్మెంట్ చూపించాలని ఆదేశించారు. కొంతమంది పనితీరు సంతృప్తికరంగా లేదని, ధోరణి మార్చుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు సమయానికి సేవలు అందించడమే ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు. అందరం బాధ్యతగా పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు.
News November 6, 2025
రూ.18వేల కోట్ల షేర్ల బైబ్యాక్.. డేట్ ఫిక్స్

ఇన్ఫోసిస్ ఈ నెల 14న ₹18వేల కోట్ల విలువైన షేర్లను బైబ్యాక్ చేయనుంది. ఈ బైబ్యాక్కు నందన్ నీలేకని, సుధామూర్తి సహా కంపెనీ ప్రమోటర్లు దూరంగా ఉండనున్నారు. వీరికి సంస్థలో 13.05% వాటా ఉంది. వాటాదారులకి ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. 10Cr షేర్లను ₹1,800 చొప్పున కంపెనీ కొనుగోలు చేయనుంది.(కంపెనీ తన సొంత షేర్లను బహిరంగ మార్కెట్/వాటాదారుల నుంచి కొనుగోలు చేయడాన్ని బైబ్యాక్ అంటారు)


