News August 17, 2025
తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిపోయిన అబార్షన్లు

గత ఐదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. APతో పోలిస్తే TGలో దాదాపు 3 రెట్లు అధికంగా ఉండటం గమనార్హం. APలో 367% పెరగ్గా, TGలో 917% పెరిగాయి. TGలో 2020-21లో 1578 అబార్షన్లు జరగ్గా 2024-25లో ఆ సంఖ్య ఏకంగా 16,059కి పెరిగింది. ఇదే సమయంలో APలో 10,676 కేసులు నమోదయ్యాయి. కాగా 25,884 అబార్షన్లతో కేరళ టాప్‌లో ఉంది. ఈ గణాంకాలను కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభలో సమర్పించారు.
Similar News
News August 17, 2025
అలాంటి సినిమాలను ఆపేయాలి: లోకేశ్

AP: సినిమాల్లో మహిళలపై వివక్షను కట్టడి చేసేందుకు సమయం ఆసన్నమైందని మంత్రి లోకేశ్ అన్నారు. ‘మహిళలకు మనమిచ్చే గౌరవమే నిజమైన నాగరిక సమాజానికి పునాది. వారి పట్ల లింగ వివక్ష, అవమానకరమైన సంభాషణలను కట్టడి చేయాలి. అలాంటి డైలాగ్స్ ఉన్న మూవీ లేదా సీరియల్‌ను ఆపేయాలి. ఇంట్లో, స్క్రీన్‌పై చూసే అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News August 17, 2025
‘ఓటు చోరీ’ అనడం రాజ్యాంగాన్ని అవమానించడమే: ఈసీ

ఓటర్ల గోప్యతకు భద్రత కల్పించాల్సిన బాధ్యత తమదేనని CEC జ్ఞానేశ్ కుమార్ చెప్పారు. ఓట్ల చోరీ అంటూ ఈసీపై ఆరోపణలు చేయడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని వ్యాఖ్యానించారు. ఓటర్ల విషయంలో ధనిక, పేద, లింగ భేదాలు ఉండవని స్పష్టం చేశారు. బిహార్ ఓటరు జాబితా విషయంలో ECపై ఆరోపణలు చేస్తున్నారని, జాబితా తయారీలో స్పష్టమైన వైఖరితో ఉన్నామని తెలిపారు. బిహార్ SIRలో అన్ని పార్టీలను భాగస్వామ్యం చేశామని పేర్కొన్నారు.
News August 17, 2025
రాబోయే గంటలో వర్షం

హైదరాబాద్‌లో రాబోయే గంట సేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ <<17432128>>వర్షాలు<<>> పడతాయని పేర్కొంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ADB, HNK, కామారెడ్డి, మెదక్, సూర్యాపేట, వికారాబాద్, WGL జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.