News August 2, 2024

దాదాపు 400 చైనా కంపెనీలపై కేంద్రం ఉక్కుపాదం!

image

దేశంలోని దాదాపు 400కుపైగా చైనా కంపెనీల (లోన్ యాప్స్, ఆన్‌లైన్ జాబ్ పోర్టల్స్ etc) గుర్తింపును కేంద్రం రద్దు చేయనున్నట్లు సమాచారం. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 700 చైనా కంపెనీలపై దర్యాప్తు చేపడుతోందని అధికార వర్గాలు తెలిపాయి. 300-400 సంస్థలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి కేంద్రం తొలగించనుందని తెలుస్తోంది. ఏపీ, కర్ణాటక, ఢిల్లీ సహా 17 రాష్ట్రాల్లో ఈ కంపెనీలు ఉన్నాయి.

Similar News

News April 8, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

ట్రంప్ పిచ్చితనాన్ని ఆపాలి: US హౌస్ డెమోక్రాట్లు

image

ఇరాన్‌ను తుడిచిపెట్టేస్తామన్న ట్రంప్ హెచ్చరికలపై US హౌస్ డెమోక్రాట్లు తీవ్రంగా స్పందించారు. ట్రంప్ ఒక అదుపు తప్పిన వ్యక్తి అని, పార్టీలకతీతంగా అందరూ కలిసి వచ్చి ఆయన పిచ్చితనాన్ని ఆపాలంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. తక్షణమే అత్యవసర సభ ఏర్పాటు చేసి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఓటింగ్ జరపాలని డిమాండ్ చేశారు. ఆయన తన చర్యలతో దేశాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.