News April 20, 2024

వచ్చే సీజన్‌లో విస్తారంగా వరి, పత్తి సాగు?

image

TG: వచ్చే సీజన్‌లో వర్షాలు పుష్కలంగా పడతాయని వాతావరణ శాఖ అంచనాల దృష్ట్యా ఖరీఫ్‌లో వరి, పత్తి సాగు విస్తారంగా ఉంటుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. సుమారు 65లక్షల ఎకరాల్లో వరి, 60లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి సాగవుతుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తం 1.50 కోట్ల ఎకరాల్లో పంట సాగు జరగొచ్చంటున్నారు. గత వానాకాలం సీజన్‌లో వరి 64 లక్షల ఎకరాల్లో, పత్తి 44.77లక్షల ఎకరాల్లో సాగైంది.

Similar News

News March 3, 2026

3,979 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, టెన్త్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ మార్చి 4 నుంచి 7 వరకు చేసుకోవచ్చు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: recruit-gov.com/

News March 3, 2026

ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

image

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

News March 3, 2026

రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 పోస్టులు

image

బెంగళూరులోని <>రైల్ వీల్ ఫ్యాక్టరీ<<>> 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(NTC), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్(NCVT) కలిగిన వారు ఏప్రిల్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15ఏళ్లు పూర్తై, 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in