News February 25, 2026
AC ధరలు హీటెక్కిస్తాయి!

ఈ వేసవిలో AC కొనాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే! రాగి, అల్యూమినియం, స్టీల్ ధరలు మండిపోతుండటం, రూపాయి విలువ తగ్గడంతో ACల రేట్లు 5 నుంచి 15% పెరుగుతాయని వోల్టాస్ ఎండీ ముకుందన్ మేనన్ చెప్పారు. రాగి టన్నుకు 13 వేల డాలర్లు పలుకుతోంది. దీంతో పాటు కొత్త పవర్ సేవింగ్ రూల్స్ వల్ల ACల తయారీ ఖర్చు భారమైంది. ధరలు పెరిగినా ఈసారి అమ్మకాలు కూడా 20% పెరుగుతాయని ముకుందన్ తెలిపారు.
Similar News
News April 16, 2026
సుప్రీంకోర్టుకు చేరిన TCS మతమార్పిడి కేసు

TCS నాసిక్‌లో జరిగిన మతమార్పిడి <<19633913>>కుట్రను<<>> ఉగ్రవాద చర్యగా పరిగణించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ ఈ కేసు వేశారు. ఈ కుట్రలతో ప్రజాస్వామ్యం, సామరస్యం, స్వేచ్ఛతో పాటు దేశ సమైక్యత, గౌరవానికీ ముప్పేనని తెలిపారు. దీనిని తీవ్రవాద చర్యగా పరిగణించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టేలా ఆదేశించాలని కోరారు. దీనిపై ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.

డీలిమిటేషన్ బిల్లుపై SCకి వెళ్తాం: DMK

డీలిమిటేషన్ బిల్లును LSలో కేంద్రం ఆమోదింపజేసుకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని DMK పేర్కొంది. ‘దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకొనేందుకు న్యాయపరమైన అన్ని చర్యలు తీసుకుంటాం’ అని ఆ పార్టీ లీగల్ వింగ్ సెక్రటరీ NR ఇలాంగో వెల్లడించారు. కాగా బిల్లును వ్యతిరేకిస్తున్న TN, WB రాష్ట్రాలకు LSలో 80మంది సభ్యులున్నారని, ఈ దశలో బిల్లు ఆమోదం పొందే అవకాశం లేదని ఆర్గనైజింగ్ సెక్రటరీ RS భారతి వివరించారు.