News October 7, 2025

మిథాలికి ACA అరుదైన గౌరవం

image

భారత మాజీ క్రికెటర్ మిథాలి రాజ్‌కు ఆంధ్ర క్రికెట్ సంఘం(ACA) అరుదైన గౌరవం కల్పించింది. వైజాగ్‌లోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో స్టాండ్‌కు మిథాలి పేరు పెట్టాలని నిర్ణయించింది. మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ కల్పన పేరును ఎంట్రన్స్‌కు పెట్టనుంది. ఈ మైదానంలోనే భారత మహిళల జట్టు ఈ నెల 9న సౌతాఫ్రికాతో, 12న ఆస్ట్రేలియాతో WC మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి జోష్‌లో ఉన్న హర్మన్ సేన వైజాగ్ చేరుకుంది.

Similar News

News October 7, 2025

కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు

image

TG: <<17925238>>జూబ్లీహిల్స్<<>> ఉపఎన్నిక రేసులో ముందు వరుసలో ఉన్న కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్‌పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈసీ నిబంధనలు ఉల్లంఘించి <<17933641>>ఓటర్ కార్డు<<>>లను పంపిణీ చేయడంతో చర్యలకు దిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావించి, మధురా నగర్ పోలీసులకు ఎన్నికల అధికారి రజినీకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 11న ఇక్కడ ఉపఎన్నిక జరగనుంది.

News October 7, 2025

‘OG’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

image

పవన్ కళ్యాణ్ ‘OG’ సినిమా ఈ నెల 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో పవర్ స్టార్ లుక్స్, యాక్షన్ సీన్స్, ఎలివేషన్లు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

News October 7, 2025

హారతి ఎందుకు ఇవ్వాలి?

image

హారతి ఇవ్వడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. గుడికి రోజూ చాలామంది భక్తులు వస్తుంటారు. దీంతో గాలిలో క్రిములు చేరతాయి. కర్పూర హారతి వెలిగిస్తే వచ్చే పొగ ఆ క్రిములను చంపి, పరిసరాలను శుద్ధి చేస్తుంది. వ్యాధులు
సోకకుండా ఆపుతుంది. హారతి తీసుకుంటే మనం తెలియక చేసిన పాపాలు కర్పూరంలా కరిగిపోతాయని, హారతిని కళ్లకు అద్దుకోవడమంటే అందరి శుభాన్ని కోరడమే అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది.<<-se>>#DharmaSandehalu<<>>