News August 27, 2024
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అకడమిక్ మానిటరింగ్ యూనిట్

AP: సాంఘిక, గిరిజన, ఆశ్రమ స్కూళ్లు, హాస్టళ్ల పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో 11 మంది నిపుణులతో అకడమిక్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల చదువు, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు, రక్షణ తదితర అంశాలను నిత్యం పర్యవేక్షిస్తారు. ఏ ఒక్క విద్యార్థీ ఫెయిల్ కాకుండా చర్యలు తీసుకుంటారు.
Similar News
News March 5, 2026
ఆగిరిపల్లి: ప్రమాదవశాత్తు మామిడి కొమ్మ పైనపడి వ్యక్తి మృతి

ఆగిరిపల్లి(M) వడ్లమాను గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జలసూత్రం రంగారావు(57) మామిడి కొమ్మలు కోయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తూ భారీ కొమ్మ పైనపడి మృత్యువాతపడ్డాడు. రోజు మాదిరిగానే పనికివెళ్లగా ఈ దుర్గటన జరిగింది. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 5, 2026
భావిభారత పౌరులు.. ఊబకాయులు!

ప్రాసెస్డ్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తదితర ఆహార అలవాట్లు దేశ భవిష్యత్తు అయిన బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. INDలో 11-17ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయం పెరిగి USను దాటి 2వ స్థానానికి చేరినట్లు ఒబెసిటీ అట్లాస్-2026 పేర్కొంది. 5-9 వయసు వారిలో 1.49కోట్లు, 10-19 ఏళ్ల వారిలో 2.6కోట్ల మంది అధిక బరువుతో ఉన్నట్లు చెప్పింది. 74% పిల్లలు శారీరక శ్రమ లేకే బరువు పెరుగుతున్నారు. అటు చైనా తొలిస్థానంలో ఉంది.
News March 5, 2026
సెమీస్‌లో టీమ్‌గా రాణిస్తారా?

T20WC: ఈరోజు ఇంగ్లండ్‌తో సెమీస్‌లో భారత్ వన్ మ్యాన్ షోలపై ఆధారపడకుండా జట్టుగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో ఎవరో ఒకరు రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈసారి భారత్ ఆ తప్పు చేయొద్దంటున్నారు. వాంఖడేలో షార్ట్ బౌండరీస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకొని బ్యాటర్లు సమష్టిగా రాణించాలని.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడకూడదని కోరుకుంటున్నారు.


