News November 14, 2024
ACBకి చిక్కిన లింగంపేట ఎస్ఐ

కామారెడ్డి జిల్లా లింగపేట ఎస్ఐ అరుణ్, రైటర్ రామాస్వామి పోలీస్ స్టేషన్‌లోనే లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 17, 2026
TU: సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్‌పై అవగాహన కరపత్రాల విడుదల

విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత కీలకమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొ.టి. యాదగిరి రావు అన్నారు. ఈ నెల 25న PIB, సమాచారం ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించనున్న ‘సైబర్ హైజీన్ ప్రాక్టీసెస్’ అవగాహన కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రిజిస్ట్రార్ యాదగిరి, పలువురు ప్రొఫెసర్లతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు.
News March 17, 2026
NZB: 21న కలెక్టరేట్ ముట్టడి: BJP

రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 21న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు BJP NZB జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి తెలిపారు. మంగళవారం BJP జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హామీలు ఇచ్చి మోసం చేసిన ప్రభుత్వానికి కలెక్టరేట్ ముట్టడి తమ సమాధానమన్నారు. కాగా రేపు మండల స్థాయిలో MRO కార్యాలయాలకు వినతిపత్రాలు అందజేస్తామన్నారు.
News March 17, 2026
రీఫండ్ పేరుతో మోసాలు.. అప్రమత్తంగా ఉండండి: సీపీ

రీఫండ్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా సీపీ సాయి చైతన్య సూచించారు. సాయం పేరుతో పంపే ఏపీకే (APK) ఫైల్స్‌ను ఇన్‌స్టాల్ చేయవద్దని, ఓటీపీలను ఎవరికీ చెప్పవద్దని కోరారు. సందేహాస్పద లింక్‌లు, కాల్స్ పట్ల జాగ్రత్త వహించాలని తెలిపారు. ఒకవేళ సైబర్ నేరానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


