News February 24, 2025

ACBకి పట్టుపడ్డ పాలకొండ మున్సిపల్ కమిషనర్

image

పాలకొండ మున్సిపల్ కమిషనర్ ఏసీబీ వలకు చిక్కినట్లు తెలుస్తోంది. డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్‌లో మిస్టేక్స్ సరిదిద్దేందుకు డాక్టర్ రౌతు భారతి నుంచి కమిషనర్ సూచనల మేరకు అతని డ్రైవర్ రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుంది. దీంతో కమిషనర్‌ను ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 24, 2025

BMC బ్యాంక్‌లో ఉద్యోగాలు

image

బాంబే మర్కంటైల్ కోఆపరేటివ్(BMC) బ్యాంక్ లిమిటెడ్‌.. బ్యాంక్ మేనేజర్, క్రెడిట్ ఆఫీసర్, ఏరియా హెడ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏదైనా డిగ్రీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 1, 2026వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 30 -50ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bmcbankltd.com/

News November 24, 2025

భారతీయ వైద్యం వైపు అమెరికన్ల మొగ్గు!

image

అమెరికాతో పోల్చితే ఇండియాలో వైద్య సదుపాయం చాలా బెటర్ అని వైద్యులు చెబుతున్నారు. ఈక్రమంలో పెరుగుతున్న ఖర్చులు, వెయిటింగ్ కారణంగా అమెరికా వంటి పాశ్చాత్య దేశాల రోగులు భారతీయ వైద్యం వైపు మళ్లుతున్నట్లు పేర్కొన్నారు. ‘భారత్‌లో అత్యల్ప ఖర్చు, తక్షణ అపాయింట్‌మెంట్‌లు (సూపర్ స్పెషలిస్ట్‌లతో సహా), MRI/CT స్కాన్ల వంటి త్వరిత డయాగ్నస్టిక్ సేవల వల్ల రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయి’ అని తెలిపారు.

News November 24, 2025

HYD: కారు ప్రమాదంలో సజీవదహనమైన దుర్గాప్రసాద్

image

శామీర్‌పేట్ ORRపై జరిగిన ప్రమాదంలో కారులో సజీవదహనమైన వ్యక్తి దుర్గాప్రసాద్ (34)గా పోలీసులు గుర్తించారు. హనుమకొండ ప్రాంత వాసి అని తెలిపారు. నగరంలో వ్యాపారం నిమిత్తం వచ్చి ఇంటికి వెళ్లేందుకు దుండిగల్‌లోని ORR వైపు మళ్లించాడని, శామీర్‌పేట్ ఎగ్జిట్ దాటిన తర్వాత ఉదయం 5:50 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కారులో హీటర్ ఆన్ చేసి నిద్రించాడేమోనని? అనుమానిస్తున్నారు.