News November 24, 2024

జగన్ క్విడ్ ప్రోకోపై ఏసీబీ విచారణ: అయ్యన్న

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆయన అవినీతిపై CBI, ACB విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘అదానీతో కాకుండా సెకీతో ఒప్పందం చేసుకున్నామని YCP ప్రకటించింది. కానీ సెకీ నోడల్ ఏజెన్సీ మాత్రమే. అదానీ కేసుతో సెకీకి సంబంధం లేదు. జగన్ క్విడ్ ప్రోకోతో రాష్ట్రానికి తీవ్ర నష్టం చేకూరింది. ప్రజలపై అధిక విద్యుత్ ఛార్జీల భారం పడింది’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News January 22, 2026

నేడు అందుబాటులోకి కళ్యాణోత్సవం టికెట్లు

image

AP: తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది. వీటితోపాటు వర్చువల్ సేవ టికెట్లను కూడా రిలీజ్ చేస్తోంది. 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు, 24న (అకామిడేషన్) రూమ్స్, రూ.300 దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. భక్తులు అధికారిక వెబ్‌సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

News January 22, 2026

సరస్వతీ దేవి అనుగ్రహం కోసం రేపేం చేయాలంటే

image

అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు పసుపు దుస్తులు ధరించాలి. పూజలో తెల్లని పూలు, గంధం సమర్పించి ‘ఓం ఐం సరస్వత్యై నమః’ మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా చక్కెర పొంగలి, కేసరి, పులిహోరను సమర్పించాలి. పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నులవుతారు. పూజా సమయంలో పుస్తకాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రార్థించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పురాణ వచనం.

News January 22, 2026

పాజిటివ్‌ థింకింగ్‌ ఎలా ప్రాక్టీస్‌ చేయాలంటే?

image

ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవాలి. కృతజ్ఞతా భావాన్ని పెంచాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. నిద్రలేచిన వెంటనే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. ఏ చిన్న విజయాన్నైనా సెలబ్రేట్ చేసుకోండి.