News January 3, 2025
6న విచారణకు రావాలని కేటీఆర్కు ACB నోటీసులు

TG: ఫార్ములా-ఈ రేస్ కార్ స్కాం కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈనెల 6న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. అటు బీఎల్ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్కు కూడా నోటీసులిచ్చింది. కాగా ఇప్పటికే ఈ స్కాంపై విచారణ చేపట్టిన ఈడీ.. ఈనెల 7న విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన 6న ఏసీబీ, 7న ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.
Similar News
News December 1, 2025
గద్వాల: ఎట్టకేలకు హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

గద్వాల మండలం కొత్తపల్లి నుంచి ఆత్మకూరు వరకు కృష్ణా నదిలో రూ.121 కోట్లతో హైలెవెల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, వాకిటి శ్రీహరి తదితరులు సోమవారం భూమి పూజ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు సమీపంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సీఎం పేర్కొన్నారు.
News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.


