News May 7, 2025

ఇరిగేషన్ మాజీ ENC ఇంటిపై ACB సోదాలు

image

TG: కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌లో కీలకపాత్ర పోషించిన ఇరిగేషన్ మాజీ ENC హరి రామ్ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఏకకాలంలో 14 ప్రాంతాల్లో సోదాలు చేపట్టింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) రిపోర్ట్ ఆధారంగా ఏసీబీ ఈ తనిఖీలు చేపట్టింది. కాగా మేడిగడ్డ బ్యారేజీ డిజైన్‌లో లోపాలు ఉన్నాయని నిన్న NDSA ఫైనల్ రిపోర్టులో వెల్లడించిన విషయం తెలిసిందే.

Similar News

News April 8, 2026

ట్రంప్ డెడ్‌లైన్‌ను పొడిగిస్తారా?

image

ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్ మరో 3 గంటల్లో ముగియనుంది. అయితే ఇరాన్‌తో తీవ్ర చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ మీడియాకు చెప్పారు. మరోవైపు 2 వారాలపాటు డెడ్‌లైన్ పొడిగించాలన్న పాక్ విజ్ఞప్తిని ట్రంప్‌కు తెలియజేశామని, దీనిపై ఆయన త్వరలో స్పందిస్తారని వైట్‌హౌస్ చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ డెడ్‌లైన్‌ను పొడిగిస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.

News April 8, 2026

US, ఇరాన్ వార్నింగ్స్.. గల్ఫ్ దేశాల్లో అలర్ట్!

image

US, ఇరాన్ పరస్పర హెచ్చరిక నేపథ్యంలో గల్ఫ్ దేశాలు అలర్ట్ అయ్యాయి. 6 గంటలపాటు ఇళ్లలోనే ఉండాలని కువైట్ తమ దేశ ప్రజలకు సూచించింది. ఇక ప్రజలు సురక్షిత ప్రాంతాలను వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం కోరింది. అటు ఖతర్‌లో థ్రెట్ అలర్ట్ జారీ చేశారు. అధికారుల సూచనలు పాటించాలని అక్కడి భారతీయులకు ఇండియన్ ఎంబసీ పేర్కొంది. సౌదీ అరేబియాకు రావొద్దని, హజ్ యాత్రను విరమించుకోవాలని US ఎంబసీ తమ దేశస్థులకు సూచించింది.

News April 8, 2026

భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఇరాన్ వార్నింగ్

image

ట్రంప్ తన హెచ్చరికలను నిజం చేస్తూ దాడులకు దిగితే ఊహించని సర్‌ప్రైజ్‌లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ మిలటరీ వర్గాలు తెలిపాయి. US, దాని భాగస్వామ్య దేశాలు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాయి. ఇక ఇరాన్‌కు ట్రంప్ విధించిన డెడ్‌లైన్‌ను 2 వారాలు పొడిగించాలని పాక్ PM షరీఫ్ కోరారు. రెండు వారాల పాటు హార్ముజ్‌ను తెరవాలని ఇరాన్‌కు విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలు సీజ్‌ఫైర్ పాటించాలన్నారు.