News November 30, 2024
ఉద్యోగిపై ACB రైడ్స్.. రూ.150 కోట్ల ఆస్తులు
TG: నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్న ACB భారీగా ఆస్తులు గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 30 ప్రాంతాల్లో నిఖేశ్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లల్లో సోదాలు చేసి రూ.150 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించింది. రూ.లక్ష లంచం తీసుకుంటూ పది నెలల క్రితం ఆయన పట్టుబడగా, ఆయనపై ACB ఫోకస్ పెట్టింది. ఆయన పేరిట 3 విల్లాలు, 3 ఫామ్‌హౌస్‌లు ఉన్నట్లు ACB గుర్తించింది.
Similar News
News November 30, 2024
మెంతికూరను ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే..
విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా లభించే మెంతికూరను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవడం తేలికే. ఆకుల్ని ఏరి 3-4 టైమ్స్ బాగా కడిగి క్లాత్‌లో ఆరబెట్టుకోవాలి. తర్వాత గాలి చొరబడని కంటెయినర్లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. క్లీన్చేసిన ఆకుల్ని కత్తిరించి జిప్‌లాక్ బ్యాగులో వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టడం మరోపద్ధతి. మెంతిని కడగకుండా కాడలతో పేపర్లో చుట్టి 13 రోజులు స్టోర్ చేయొచ్చు.
News November 30, 2024
జీవో 317పై ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
TG: జీవో 317పై క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్, స్పౌస్, మ్యూచువల్ ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలంటూ 243, 244, 245 ఉత్తర్వుల్లో పేర్కొంది. ఖాళీలకు లోబడి స్థానిక కేడర్‌లో మార్పు, బదిలీకి అవకాశం కల్పించింది. అయితే ప్రస్తుతం ఆయా స్థానాల్లో ఉన్న ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సర్కార్ మార్గదర్శకాల్లో సూచించింది.
News November 30, 2024
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
ఖాతాదారులకు EPFO సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ శుభవార్త చెప్పింది. ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్ చేసే తేదీ వరకూ చందాదారుడికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ప్రస్తుతం సెటిల్మెంట్ చేసే నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం అమల్లో ఉంది. దీంతో ఖాతాదారుడికి ఆర్థికంగా నష్టం జరుగుతోందన్న ఫిర్యాదులు రావడంతో ఇవాళ్టి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.